హైదరాబాద్: దేశంలో పచ్చని పొలాల్లో నీరు పారాలా? లేక విద్వేషాలతో రక్తం ఏరులై పారాలా? అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అడిగారు. దేశంలో సిరులు కురుపించే పంటలు కావాలా? అని ప్రజలను ఉద్దేశించి సిఎం అసెంబ్లీలో ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన సభలో కెసిఆర్ మాట్లాడారు. మతోన్మాదులు సృష్టించే మంటలు కావాలా? అని అడిగారు. ప్రజల అవసరాల కోసం నిర్మాణాలు చేపట్టే నాయకత్వం కావాలా? లేక ప్రజలను ఇబ్బందుల కు గురిచేసేలా ఉన్నవి కూలకొట్టే నాయకుడు కావాలా? అని కెసిఆర్ అడిగారు. దేశ సంపద అందరికీ అందేలా చేసే లీడర్ కావాలా?, దేశంలోని అందరి సంపద అదానీకి అందించే నాయకుడు కావాలా? ప్రజలు తెల్చుకోవాలని సూచించారు. ప్రపంచంలో దేశాన్ని నెంబర్ వన్ గా నిలిచేలా చేసే నాయకత్వం కావాలా? లేక ప్రపంచం ముందు దేశాన్ని నవ్వులపాలు చేసే నాయకుడు కావాలా? అని మోడీ ప్రభుత్వంపై కెసిఆర్ చురకలంటించారు. దేశ ప్రజల సంక్షేమం కోసం పనిచేసే లీడర్ కావాలా? లేక దేశాన్ని సంక్షోభానికి గురిచేసే నాయకత్వం కావాలా? అని అడిగారు.
పచ్చని పొలాల్లో నీరు పారాలా? లేక విద్వేషాలతో రక్తం ఏరులై పారాలా?: కెసిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -