Monday, December 23, 2024

హైదరాబాద్‌లో యాదాద్రి కలిసిపోతుంది: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR speech in Yadadri

యాదాద్రిభువనగిరి: యాదాద్రి కూడా హైదరాబాద్‌లో కలిసిపోతుందని సిఎం కెసిఆర్ తెలిపారు. భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ భవనాన్ని శనివారం కెసిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చాక సంపద బాగా పెరిగిందన్నారు. ఉద్యోగుల జీతాలు ఇంకా పెరుగుతాయని, దళితులకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని, 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయని, ఉద్యోగాల విషయంలో కొందరు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయన్నారు. గొర్రెల పెంపకంలో తెలంగాణలో ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోందని కొనియాడారు.

తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగాయని, భూముల విలువ విపరీతంగా పెరిగాయని ప్రశంసించారు. యాదాద్రి జిల్లా ఏర్పాటును ఎవరూ ఊహించలేదని,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యాదాద్రి జిల్లా ఏర్పాటు కోరినా సాధ్యపడలేదన్నారు. తెలంగాణ వచ్చాకే అది సాధ్యమైందని సిఎం కెసిఆర్ ప్రశంసించారు. దివంగత ఎన్టీఆర్‌ను మంచిర్యాల జిల్లా కావాలని అడిగినా అదీ సాధ్యపడలేదని గుర్తు చేశారు. భువనగిరి సులువుగా అభివృద్ధి చెందే ప్రాంతమని, ఇక్కడ జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.  భువనగిరిలో ఇప్పుడు ఎకరం భూమి రెండు నుంచి మూడ కోట్ల వరకు ధరలు పలుకుతున్నాయని ప్రశంసించారు. మారుమూల ప్రాంతాల్లోనూ 20 లక్షలకుపైనే భూముల ధరలు ఉన్నాయని కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News