టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా ఆలోచన చేసి తెచ్చిందేనని సిఎం కెసిఆర్ ప్రకటించారు. సంస్కరణ అనేది అంతం కాదు.. కొనసాగుతూనే ఉంటుందని తెలపారు. అందరి సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో పార్టీ కార్యాలయం, కలెక్టరేట్‌ను కెసిఆర్ ప్రారంభించారు. అనంతరం ఎంవీఎస్ కాలేజ్ ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సభలో కెసిఆర్ మాట్లాడుతూ… ‘‘ఏడేళ్ల క్రితం 60వేల కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండేది. ఇప్పుడు 3లక్షల కోట్లకుపైగా బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం. సంక్షేమ కార్యక్రమాల్లో మనకు సాటి ఎవరూ లేరు. గతంలో భయంకరమైన కరెంట్ బాధలు ఉండేవి.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ తెలంగాణ కోరుకున్నామో ఆ బాటలో ఉన్నాం. మనం ఉన్నప్పుడు ఏం చేశామన్నదే ముఖ్యం.. జీవితానికి అదే పెద్ద పెట్టుబడి, సంతృప్తి. గురుకులాలను 3, 4 రెట్లు పెంచుతాం. కంటివెలుగు ఆషామాషీగా తెచ్చిన కార్యక్రమం కాదు’’ అని కెసిఆర్ వివరించారు.