Thursday, January 23, 2025

మహోన్నత ప్రజాపాలకుడు శ్రీరాముడు

- Advertisement -
- Advertisement -

CM KCR Sriramanavami wishes the people of Telangana

రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని సిఎం తెలిపారు. సామాజిక విలువను తుచ తప్పకుండా ఆచరించి, ధర్మాన్ని విలువలను కాపాడేందుకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజా పాలకుడు సీతారామ చంద్రుడు భారతీయుల ఇష్ట దైవమని సిఎం కెసిఆర్ కీర్తించారు. లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర భార్యా భర్తలబంధం అజరామరమైనదని, భవిషత్ తరాలకు ఆదర్శనీయమైనదని అన్నారు.భద్రాచల సీతారాముల వారి ఆశీస్సులు సదా రాష్ట్ర ప్రజలకు ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని శ్రీ సీతారాములను ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ప్రార్ధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News