Monday, December 23, 2024

సింగరేణి కార్మికులకు కొండంత అండగా సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: సింగరేణి కార్మికులకు కొండంత అండ సిఎం కెసిఆర్ అని బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రామగుండం దశాబ్ధి ప్రగతి బాట కార్యక్రమాన్ని సింగరేణి ఆర్జీ 1 ఏరియా వర్క్‌షాప్‌లో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు, 7ఎల్‌ఇపి ప్రమాద మృతులకు ఆ యన నివాళి అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రక్తాన్ని చెమటగా మార్చి తమ జీవితాలను ఫణంగా పెట్టి వెలుగులు అందిస్తు న్న సింగరేణి గని కార్మికులు బార్డర్‌లో సైనికులతో సమాధానం అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో 14 ఏళ్ల పాటు అలుపెరగని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సాగించి, పట్టువదలని విక్రమార్కుడి వలే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో గని కార్మికుల పాత్ర మరువలేనిదని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం రాష్ట్ర ముఖ్యమం త్రి కెసిఆర్ మార్గనిర్దేశంలో సింగరేణి సంస్థ లాభాల్లో గొప్పగా సాధించిందని అన్నారు. తక్కువ కాలంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు మోడీ సర్కారు కుట్ర చేస్తుందన్నారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటిని సిఎం కెసిఆర్ నెరవేర్చారని అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రజాహిత పాలన అందిస్తున్న సిఎం కెసిఆర్‌ను మరువద్దని, సిఎం కెసిఆర్‌కు గని కార్మికులందరూ అండగా నిలవాలని అన్నారు. అనంతరం మహిళా ఉద్యోగులు టిబిజికెఎస్‌లో చేరగా, వారికి యూనియన్ కండువాలు కప్పి ఆహ్వానించారు. సమావేశంలో నాయకులు గండ్ర దామోదర్ రావు, జనగామ మల్లేష్, కర్రావుల మహేష్, లక్ష్మికాంత రావు, చెలకలపల్లి శ్రీనివాస్, వెంకటస్వామి, శేషగిరి, మానశ్రీ ప్రగణతి, వడ్డెపల్లి శంకర్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News