Wednesday, January 22, 2025

ఏం చేద్దాం?

- Advertisement -
- Advertisement -

CM KCR strategy On presidential election

జాతీయ కూటమి
దిశగా అడుగులు

అందరితో విస్తృతస్థాయి చర్చలు జరిపిన కెసిఆర్
రాష్ట్రపతి ఎన్నికపై పలు కోణాల్లో సమాలోచనలు
ఒకటి, రెండ్రోజుల్లో కీలక నిర్ణయం

మన తెలంగాణ/హైదరాబాద్ :బిజెపికి వ్యతిరేకంగా జాతీయ కూటమి దిశగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోం ది. అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌సిలు, పార్టీ ముఖ్యులతో ఆయన సమావేశమయ్యారు. మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందడం, ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం, రాష్ట్రాల హక్కు లు కాలరాయడం, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న అంశాలు సమావేశంలో కీలకంగా చర్చకు వచ్చినట్టు వినికిడి. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరో ప్రత్యామ్నాయ వేదికను తీసుకురావాల్సిన అవసరం ఉందని సమావేశంలో అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఏమాత్రం ప్రభావితం చేయలేకపోవడం, బిజెపిని దీటుగా ఎదుర్కొనలేకపోతోంది. ఇలాం టి పరిస్థితుల్లో కలిసివచ్చే ప్రాంతీయ పార్టీలను కలుపుకోవాలి, అదేబాటలో అవసరమైతే జాతీయస్థాయిలో ప్ర త్యామ్నాయ పార్టీ ఏర్పాటు చేయాల్సిన అంశాలపై కూ డా పార్టీ ముఖ్యులతో కెసిఆర్ కూలంకషంగా చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కలిసివచ్చే ప్రాంతీయ పార్టీలను కలుపుకుని పోవాలన్నదే ముఖ్యం గా కన్పిస్తోంది. లేని పక్షంలోనే జాతీయ పార్టీ ఆలోచన గా కన్పిస్తోంది. కాగా, బిజెపికి ప్రస్తుతం ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లోనే ప్రభావి తం కావడంతో బిజెపికి ప్రత్నామ్నాయంగా మరో జాతీ య పార్టీ అవసరాన్ని ఈ సందర్భంగా పలువురు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది.

రాష్ట్రపతి ఎన్నికపైనా చర్చ
రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సిఎం కెసిఆర్ దృష్టి సారించారు. బిజెపి నిర్ణయించిన అభ్యర్ధికి మద్దతు తెలుపడమా? లేక పలు ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రత్యామ్నాయ అభ్యర్ధిని బరిలోకి దింపడమా? ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? లేదా తటస్థంగా ఉండడమా? తదితర అంశాలపై పార్టీ నేతలతో కెసిఆర్ మంతనాలు సాగించారు. సమావేశంలో రాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బిజెపి సర్కార్‌పై యుద్దం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ పార్టీకి షాక్ ఇచ్చేందుకు ఏ మేరకు అవకాశాలు ఉన్నాయనే అంశంపై కూడా పలు కోణాల్లో కెసిఆర్ ఆరా తీశారని తెలుస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థిగా బిజెపి ఎవరి పేరును ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి? ఒకవేళ తెలుగువారికి అభ్యర్థిగా అవకాశం కల్పిస్తే మన పార్టీ స్టాండ్ ఎలా ఉండాలి? అనే విషయంపై కెసిఆర్ సమగ్రంగా చర్చించారు. అయితే బిజెపి నిర్ణయించిన అభ్యర్థితో సంబంధం లేకుండా పలు ప్రాంతీయ పార్టీలతో కలిసి మరోకరిని రాష్ట్రపతిగా బరిలోకి దింపితే ఎలా ఉంటుంది?

అలా ఒకవేళ అభ్యర్థిని నిలబెట్టాల్సి వస్తే.. ఎవరిని రంగంలోకి దించితే బాగుంటుంది? గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉంటాయి? అనే అంశాలపై కూడా పలు కోణాల్లో పార్టీ నేతలతో కెసిఆర్ సమీక్షించారు. ఒకవేళ రాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉంటే.. ఇతర పార్టీల నుంచి ఏమైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలు ఉంటాయా? అనే అంశంపై మరోసారి సమావేశమై కీలకనిర్ణయం తీసుకుందామని పార్టీ నేతలకు కెసిఆర్ సూచించినట్లుగా తెలిసింది. అయితే ఈ ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహంపై అప్పుడే తొందరపడి ఒక నిర్ణయం తీసుకోవడం కంటే మరో ఒకటి, రెండు రోజుల పాటు వేచిచూడడంతోపాటు అన్ని అంశాలపై లోతుగా సమీక్షించిన మీదటనే ఒక నిర్ణయానికి రావడం మంచిదని పలువురు మంత్రులు సిఎం కెసిఆర్‌కు సూచించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, కెటిఆర్, మహముద్ అలి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాల అజయ్‌కుమార్, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మల్లారెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ చీప్ విప్ వినయ్ భాస్కర్, ఎంపిలు నామా నాగేశ్వర్‌రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, నేతకాని వెంకటేష్, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, విప్‌లు గువ్వల బాలరాజ్, బాల్క సుమన్, మండలి విప్ ఎంఎస్ ప్రభాకర్, ఎంఎల్‌సిమధుసూదనాచారి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News