Monday, December 23, 2024

కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని రైతులను తాము కోరామని సిఎం కెసిఆర్ తెలిపారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనాలని సిఎం కెసిఆర్ ఢిల్లీలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కెసిఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రైతులను రెచ్చగొట్టారన్నారు. ధాన్యం ఖరీదుతో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సంబంధం లేదన్నారు. ఇప్పుడు సిగ్గులేకుండా హైదరాబాద్‌లో ఎలా ధర్నా చేస్తున్నారని మండిపడ్డారు. బిజెపికి సిగ్గు, శరం లేదని, కేంద్రాన్ని గద్దె దించే సత్తా రైతులకు మాత్రమే ఉందని, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఒకటే చెబుతున్నా ఎవరితోనైనా పెట్టుకోండి కానీ రైతులతో కాదని హెచ్చరించారు. బోర్ల దగ్గర మీటర్లు పెట్టాలని కండీషన్ పెడతారా? అని ప్రశ్నించారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై ఇడి, ఐటి అంటూ బెదిరిస్తారా? చురకలంటించారు. బిజెపిలో అందరూ సత్యహరిశ్చందులే ఉన్నారా? అని, చోటామోటా నేతలు కూడా సిఎంను జైళ్లో వేస్తామంటున్నారని, తనని జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని, దమ్ముంటే తనని జైలుకు పంపించాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీకి చేతులు జోడించి చెబుతున్నానని, రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని కోరుతున్నానన్నారు. హిట్లర్, నెపోలియన్ వంటి వారు కాలగర్భంలో కలిసిపోయారని, ఎవరూ శాశ్వతం కాదని, ఎందుకీ అహంకారం అని అడిగారు. ఎన్నికలు వస్తేనే మోడీకి రైతులు గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు.

ఉద్య‌మాల పోరాట ఫ‌లితంగా 2014లో తెలంగాణ వ‌చ్చింద‌ని కెసిఆర్ గుర్తు చేశారు. రాష్ట్రం వ‌చ్చాక రైతుల కోసం అనేక సంస్క‌ర‌ణ‌లు తెచ్చామ‌ని తెలిపారు. రైతుల‌కు ఉచితంగా 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్ అందిస్తున్నాం. మిష‌న్ కాక‌తీయ ద్వారా చెరువుల‌ను పునరుద్ధ‌రించాం. ప్రాజెక్టుల‌ను పూర్తి చేసుకున్నాం. సాగుకు స‌రిప‌డా నీటిని అందిస్తున్నామ‌ని చెప్పారు. తెలంగాణ‌లో కోటి ఎక‌రాల భూమి సాగులోకి వ‌చ్చింద‌న్నారు. ప్ర‌ధాని స్వ‌రాష్ట్రం గుజ‌రాత్‌లో విద్యుత్ కోసం రైతుల ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయ‌ని కెసిఆర్ తెలిపారు.

కేంద్రానికి 24 గంట‌ల డెడ్‌లైన్ విధించారు. 24 గంట‌ల్లోపు ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. దేశంలోని రైతులు భిక్ష‌గాళ్లు కాదు.. ఒకే విధానం లేక‌పోతే రైతులు రోడ్ల‌పైకి వ‌స్తార‌ని కెసిఆర్ స్ప‌ష్టం చేశారు. మోదీ, పీయూష్ గోయ‌ల్‌కు రెండు చేతులు జోడించి విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాల‌ని కోరుతున్నాన‌ని కెసిఆర్ విజ్ఞ‌ప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News