Saturday, December 21, 2024

ప్రజల దృష్టి మళ్లించడానికే..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. మోడీ, అదానీ అనుబంధం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే మనీష్ సిసోడియాను అరెస్టు చేశారు తప్ప మరొకటి కాదని సిఎం కెసిఆర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, సిసోడియా అరెస్టుపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు.

బిజెపి అవలంబిస్తున్న తీరుపై ఆయన ధ్వజమెత్తా రు. ప్రతిపక్ష పార్టీలను భయపెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటుందని ఆయన ఆరోపించారు. దీనిని ప్రజాస్వామ్యంపై దాడిగా ఆయన అభివర్ణించారు. ఇది అధికార దుర్వినియోగమన్నారు. ఇలాంటి అణచివేత మన దేశం పునాదిని దెబ్బతీస్తుందని, దీనిని ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News