Tuesday, January 21, 2025

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా సీఎం కేసీఆర్

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కావొద్దని సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ పథకానికి శ్రీకారం చుట్టారని బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 44 డివిజన్ల పరిధిలోని జోగయ్యపల్లి, సింగారం గ్రామాలకు చెందిన నలుగురు లబ్ధిదారులకు రూ. 4,00,464 చెక్కులను ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ స్వయంగా లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కావొద్దనే సీఎం కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. దేశంలో కల్యాణలక్ష్మి పథకం కింద రూ. 1,00,116 ఇస్తున్న ఏకైక రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ కార్పోరేటర్ ఇండ్ల నాగేశ్వర్‌రావు, డివిజన్ ప్రెసిడెంట్ జైపాల్‌రెడ్డి, రైతు బంధు మండలాధ్యక్షుడు సంపత్‌రెడ్డి, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News