Saturday, December 21, 2024

సూర్యాపేటలో ముఖ్యమంత్రి పర్యటన వాయిదా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ సూర్యాపేట ప్రతినిధి : ఈనెల 24న సూర్యాపేట జిల్లాలో జరగాల్సిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యటన వాయిదా పడింది. గడిచిన కొద్ది రోజులుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తుండడంతో, వాయిదా అనివార్యమైనట్లుసమాచారం. ముఖ్యమంత్రి కెసిఆర్ సూర్యాపేట జిల్లా పర్యటన సందర్భంగా నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయం తో పాటు బారాస జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం చేసేందుకు కార్యక్రమాన్ని రూపొందించిన విషయం విధితమే. మంత్రి జగదీశ్ రెడ్డి తో పాటు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నప్పటికీ వర్షం రూపంలో పర్యటన తాత్కాలిక వాయిదా పడినట్లు అయింది. ఆగస్టు మొదటి వారంలో సూర్యాపేటలో ఉండే అవకాశం ఉంది.

Also Read: మృత్యుంజయుడు ఆ జెసిబి డ్రైవర్(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News