- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కాసేపట్లో ఉత్తరప్రదేశ్ కి బయలుదేరనున్నారు. సిఎం కెసిఆర్ తో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పయనం కానున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు సిఎం కుసిఆర్ మంగళవారం హాజరుకానున్నారు. యుపిలోని ఇటావా జిల్లాలో ఉన్న ములాయం స్వ్రగామం సైఫయీకి మధ్యాహ్నం వరకు ముఖ్యమంత్రి చేరుకొంటారు. ములాయం సింగ్ పార్థివదేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించనున్నారు ముఖ్యమంత్రి కెసిఆర్. సాయంత్రం 6 గంటలకు సిఎం ఢిల్లీకి చేరుకోనున్నారు. రాత్రికి ఆయన ఢిల్లీలోనే బస చేయనున్నారు. ములాయం సింగ్ యాదవ్(82) సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.
- Advertisement -