Tuesday, January 28, 2025

సిఎం కెసిఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని డప్పు చాటింపు..

- Advertisement -
- Advertisement -

నా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జగిత్యాలలో ఈ నెల 7న జరిగే బహిరంగ సభకు వెళుతున్న తరుణంలో సభను విజయవంతం చేయాలని మహిళా సంఘాలు, కుల సంఘాలు, బిసి సోదరులు ఎస్సీ, ఎస్టీ మైనార్టీ కుల బాంధవులు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, విద్యార్థి సంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు, పార్టీ అనుబంధ సంఘాలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు పెద్ద ఎత్తున తరలిరావాలని కరీంనగర్ తెలంగాణ చౌక్ వ్యవస్థాపకుడు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జీఎస్ పిలుపునిచ్చారు. తెలంగాణ చౌక్ నుండి రాంనగర్ ప్రాంతంలో టవర్ సర్కిల్లో కోర్టు చౌరస్తాలో డప్పు చాటింపు కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో బోయినపల్లి వినోద్ కుమార్, మంత్రి గంగుల కమలాకర్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు, ఎక్స్ ఎమ్మెల్సీ నార్దాసు లక్ష్మణరావు, జిల్లా పరిషత్ చైర్మన్ కన్నా మల్ల విజయ, కరీంనగర్ మేయర్ వై సునీల్ రావులతో పాటు పలువురు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొనున్నట్లు జీఎస్ ఆనంద తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News