Saturday, November 23, 2024

నేడు మంత్రివర్గ సమావేశం

- Advertisement -
- Advertisement -

బడ్జెట్‌కు గ్రీన్‌సిగ్నల్?
మంత్రులకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

 

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ తుది నివేదికకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆ మోదముద్ర పడింది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఆర్ధిక శాఖ ముఖ్యమంత్రి కార్యాలయాని సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనలపై సిఎం రెండు రోజులపాటు కసరత్తులు చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది వివిధ మార్గాల ద్వారా ఖజానాకు వస్తున్న పన్నుల రాబడులు, ఎక్సైజ్ వసూళ్లు, ఇతర రాబడులను బేరిజు వేసిన సిఎం సినియర్ అధికారులతో బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షలు నిర్వహించారు. రాష్ట్ర రాబడులు వచ్చే ఏడాదికి వనరుల లభ్యత, నిధుల సమీకరణ, వివిధ శాఖలకు నిధుల కేటాయింపులు తదితర అంశాలపై ఒక నిర్ణయానికి రాగలిగారు. ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమశ్ కుమార్, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తదితరులతో నిర్వహించిన సమావేశంలో ఆదాయాలు-అవసరాలను సమీక్షించి 2021-22ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ నివేదికకు తుదిమెరుగులు దిద్దారు. మంగళవారం ఈ ప్రక్రయను పూర్తి చేసిన అనంతరం బడ్జెట్ నివేదికను ముద్రణకు పంపినట్టు సమాచారం . బుధవారం నాటికి బడ్జెట్ ప్రతుల ముద్రణ పూర్తి కానుంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ వివరాలు ఎక్కడా బయటకు పొక్కకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు. ముద్రణ ప్రక్రియ జరిగే చోట కూడా తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేడు మంత్రివర్గం ముందుకు బడ్జెట్
రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని బుధవారం నిర్వహించనున్నట్టు సమాచారం.ఈ సమవేశం రాత్రి 7 గంటలకు ప్రగతి భవన్‌లో జరగనుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 2021…2022 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రూపొందించిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ముందుంచునున్నారు. మంత్రవర్గం నివేదిక పరిశీలన అనంతరం బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయనుంది. ప్రగతి భవన్‌లో సిఎం అధ్యక్షతన బడ్జెట్ సమావేశాల వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు.
ఇతర అంశాలపై కూడా రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. శాసనసభలో ,శాసనమండలిలో బడ్జెట్ సమావేశాల సందర్బంగా అనుసరించాల్సిన వ్యుహంపై కూడా మంత్రులకు ఈ సందర్భంగా సిఎం దిశానిర్దేశం చేస్తారు. ఇతర పాలనాపరమైన అంశాలు, రాజకీయ అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలకు పిఆర్‌సి ఇచ్చే అంశంతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు తదితర అంశాలపై కూలంకషంగా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారని తెలుస్తోంది. ఈనెల 18న రాష్ట్ర వార్షిక బడ్జెట్ చట్టసభల ముందుకు రానుంది. రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు శాసనమండలిలో కూడ సీనియర్ మంత్రిచేత వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

CM KCR to Chair Cabinet meeting on March 17

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News