- Advertisement -
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కాసేపట్లో చండీగఢ్ కు చేరుకోనున్నారు. ఢిల్లీ నుంచి కేజ్రీవాల్ తో కలిసి ప్రత్యేక విమానంలో పంజాబ్ కు వెళుతున్నారు. ఛండీగఢ్ ఎయిర్ పోర్టులో పంజాబ్ సిఎం భగవంత్ సింగ్ మాన్ స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత గాల్వాన్ లోయ అమరజావాన్లకు సిఎం కెసిఆర్ నివాళులర్పించనున్నారు. సాయంత్రం సాగు ఉద్యమంలో చనిపోయిన 600 మంది రైతు కుటుంబాలకు చెక్కులు అందివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ సిఎం పాల్గొనున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో సిఎం కెసిఆర్ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ తో సమావేశమయ్యారు కెసిఆర్. విందు భేటీలో పలు అంశాలపై కెసిఆర్, కేజ్రీవాల్ చర్చించారు. జాతీయ రాజకీయాలు, సమాఖ్య స్ఫూర్తిపై ఇరువురు నేతలు ముచ్చటించారు. దేశ ప్రగతి రాష్ట్రాల పాత్ర,కేంద్రం విధానాలపై సిఎంలు చర్చించారు.
- Advertisement -