Sunday, December 22, 2024

రేపు రెండు చోట్ల సిఎం కెసిఆర్ నామినేషన్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం(నవంబర్ 9) రెండు చోట్ల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. గజ్వేల్‌లో ఉదయం 11 గంటలకు మధ్యలో కెసిఆర్ మొదటి నామినేషన్ దాఖలు చేసి, కామారెడ్డిలో మధ్యాహ్నం 2 గంటలకు మధ్యలో రెండవ నామినేషన్ సమర్పించనున్నారు. ఇటీవల సిఎం కెసిఆర్ సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని వెంకన్న సన్నిధిలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల్లో నామినేషన్ వేసే ప్రతిసారి సిఎం కెసిఆర్ ఈ ఆలయంలో పూజలు చేస్తూ వస్తున్నారు.

గురువారం గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో నామినేషన్లు వేయనున్నారు. అదేరోజు బిఆర్‌ఎస్ ఆశీర్వాదసభల్లో పాల్గొననున్నారు. కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం సిఎం కెసిఆర్‌కు, పార్టీకి సెంటిమెంట్‌గా ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్క డ పూజలు చేసిన తర్వాతే సిఎం కెసిఆర్ నామినేషన్ దాఖలు చేస్తారు. కెసిఆర్, హరీశ్‌రావు, ఇతర పార్టీ నేతలు ఎన్నికల సమయంలో వెంకన్నకు దర్శించుకుని స్వామివారి సన్నిధిలో నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News