ఆదివాసి గిరజనుల సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వ కృషి
తెలంగాణలో ఘనంగా ఆదివాసి, గిరిజన జాతరలు
సంస్కృతికి ప్రతిబింబాలుగా మ్యూజియంల ఏర్పాటు
సిఎం చేతుల మీదుగా 17న సేవాలాల్ బంజారా భవనాల ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివాసి, గిరిజనుల సమగ్రాభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. వారి సంస్కృతి, సాంప్రదాయల పరిరక్షణకు ప్రాధాన్యతినిస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో రూ.24.68 కోట్ల ఖర్చుతో ఆదివాసీ భవన్, రూ.24.43 కోట్లతో సేవాలాల్ బంజారా భవనాలను నిర్మించడం జరిగింది. వీటిని ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నెల 17న ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.75.86 కోట్ల వ్యయంతో 32 ఆదివాసి, బంజారా భవనాలను ప్రభుత్వం నిర్మించింది. హైదరాబాద్‌లో 3, పూర్వ జిల్లా కేంద్రాల్లో 10, ఐటిడిఎలు ఉన్న మూడు చోట్ల, 12 ఎస్‌టి నియోజకవర్గ కేంద్రాల్లో ఈ భవనాలను నిర్మిస్తున్నారు.
ఆదివాసి యోధుడు కుమ్రమ్‌భీమ్, బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్‌ల జయంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. అసియాలోనే అతిపెద్దదైన సమ్మక్క సారలమ్మ జాతరను అధికారికంగా నిర్వహిస్తున్నారు. నాగోబా జాతర, జంగుబాయి జాతర, బౌరంపూర్ జాతర, ఎరుకల నాంచారమ్మ జాతర, గాంధారి మైసమ్మ జాతరలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఆదివాసీ గిరిజన జాతరల నిర్వహణ, వసతుల కల్పనకు ప్రభుత్వం గత ఎనిమిదేళ్ళలో రూ.354 కోట్లు ఖర్చు చేసింది. ఆదివాసి హక్కుల కోసం పోరాడి అమరుదైన కుమరం భీం స్మారక కేంద్రాన్ని జోడేఘాట్ వద్ద ప్రభుత్వం నెలకొల్పింది. కొత్తగా ఏర్పడిన ఆసిషాబాద్ జిలాలకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాగా ప్రభుత్వం పేరు పెట్టింది. మేడారం వద్ద కోయ గిరిజన తెగ సంస్కృతి, సంప్రదాయాలను చాటే విధంగా సమ్మక్క సారలమ్మ మ్యూజియంను ఏర్పాటు చేశారు. మ్యూజియంల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.22.53 కోట్లు ఖర్చు చేసింది.
CM KCR to inaugurate Banjara Bhavans in Hyderabad