Monday, January 20, 2025

మే 2న ఢిల్లీకి సిఎం కెసిఆర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మే 2న ఢిల్లీ వెళ్లనున్నారు. మే 4వ తేదీన ఢిల్లీలో బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని సిఎం ప్రారంభించనున్నారు. కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత అదే రోజున ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్‌కు తిరిగి రానున్నట్లు తెలిసింది. లేదంటే కొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండి వివిధ పార్టీల నాయకులతో సమావేశమయ్యే అవకాశం ఉంది.

దేశ రాజధాని న్యూఢిల్లీలో వసంత్ విహార్‌లో నిర్మిస్తున్న భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయ తుది దశ నిర్మాణ పనులను ఇటీవల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ ఆలోచనల ప్రకారం బిఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణ ఫినిషింగ్ పనులపై మంత్రి నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News