Saturday, November 16, 2024

నయా నజరానా

- Advertisement -
- Advertisement -


మనతెలంగాణ/హైదరాబాద్ ః దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆగస్టు 4వ తేదీన సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం పోలీస్ శాఖ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు నగర సిపి సివి ఆనంద్ పలువురు సీనియర్ ఐపిఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సిటీ పోలీసుల చరిత్ర తెలియజెప్పేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. నగరంలోని బంజారాహిల్స్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను రూ.585 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుతో అనుబంధం ఉన్న అన్ని శాఖలకు నగర పోలీసు కమీషనర్ సివి ఆనంద్ ఓ మెమోను రిలీజ్ చేశారు. ప్రారంభోత్సవానికి ముందే పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలని సిపి కోరారు. చరిత్రాత్మక రీతిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం సాగుతోందని, అయితే లాజిస్టిక్స్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్‌కు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరారు. కమాండ్ సెంటర్ ప్రారంభోత్సవాన్ని గ్రాండ్‌గా నిర్వహించాలని, దీని ద్వారా హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రతిష్టను ఇనుమడింప చేయాలని తన మెమోలో తెలిపారు. కాగా రాష్ట్ర పోలీసు శాఖలో ఉన్న వివిధ రకాల యూనిట్లు అన్నీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఒకే వేదికగా పని చేయనున్నాయి. ఈనేపథ్యలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పాపులర్‌గా పోలీస్ టవర్స్ అని పిలుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సుమారు 9.25 లక్షల కెమెరాలను ఈ సెంటర్‌లో మానిటర్ చేయనున్నారు. అత్యాధునిక సాంకేతికతో ఆధునిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న కమాండ్ కంట్రోల్ కేండ్రాన్ని ఆగస్టు 4న ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించనున్న నేపథ్యంలో పోలీసు శాఖ ఉన్నతాధికారులు కమాండ్ కంట్రోల్ సమీపంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు.
సీనియర్ ఐపిఎస్‌లకు బాధ్యతలు ః
కమాండ్ కంట్రోల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి అదనపు సిపి చౌహాన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమానికి విచ్చేయనున్న అతిథుల ప్రొటోకాల్‌తో పాటు ఇతర ఏర్పాట్లను హైదరాబాద్ అదనపు సిపి ఏఆర్ శ్రీనివాస్ చూసుకోనున్నారు. అతిథులుగా ఎవరెవరిని ఆహ్వానించాలనే విషయాలతో పాటు ఆడిటోరియానికి సంబంధించి జాయింట్ సిపి మస్తీపురం రమేశ్ బాధ్యుడిగా వ్యవహరించనున్నారు. వచ్చిన అతిథులకు జ్ఞాపికలతో పాటు సన్మానం చేసే పనులను జాయింట్ సిపి విశ్వప్రసాద్ చూసుకోనున్నారు. గార్డ్ ఆఫ్ హానర్ పనులను జాయింట్ సిపి కార్తికేయ, ట్రాఫిక్ ప్రొటోకాల్‌ను ట్రాఫిక్ అదనపు సిపి ఏఆర్ రంగనాథ్‌కు అప్పగించారు. కమాండ్ కంట్రోల్‌లో ప్రదర్శించనున్న వీడియోలను జాయింట్ సిపి గజరావ్ భూపాల్ పర్యవేక్షించనున్నారు. బందోబస్తును వెస్డ్‌జోన్ డిసిపి జోయల్ డేవిస్, మ్యూజియంనకు బాధ్యుడిగా సెంట్రల్ జోన్ డిసిపి రాజేశ్, 7వ అంతస్థులో ఉన్న విఐపి గదులకు సౌత్ జోన్ డిసిపి సాయిచైతన్య బాధ్యులుగా వ్యవహరించనున్నారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం అలంకరణ బాధ్యతలు డిసిపి సునీతా రెడ్డి, పోలీస్ వర్టికల్స్‌ను నార్త్ జోన్ డిసిపి చందనా దీప్తి వివరించనున్నారు.
14,15 అంతస్థుల వరకు అనుమతి ః
దేశవ్యాప్తంగా రాష్ట్ర పోలీసుశాఖకు వన్నెతెచ్చేలా రాష్ట్రప్రభుత్వం ఎన్నో ప్రత్యేకతలతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ భవనాన్ని నిర్మించింది. రూ.585 కోట్లు వెచ్చింది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఐకానిక్ భవనంగా తీర్చిదిద్దింది. సాంకేతిక హంగులతో 19 అంతస్థులున్న ఈ భవనం నుంచి 360 డిగ్రీల కోణంలో భాగ్యనగరాన్ని వీక్షించవచ్చని పోలీసు అధికారులు వివరిస్తున్నార్చు. ఈ భవనంలో సందర్శకులూ 14, 15 అంతస్థుల వరకు వెళ్లేందుకు అధికారులు అనుమతించనున్నారు. ఈక్రమంలో 14,15 అంతస్థుల నుంచి హైదరాబాద్ నగరాన్ని 360 డిగ్రీల కోణంలో వీక్షించవచ్చని, అదేవిధంగా ఆరో అంతస్థులోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి వచ్చి బయట నుంచి పోలీసులు చేస్తున్న ఆపరేషన్‌ను వీక్షించేందుకూ సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు.

CM KCR to Inaugurate Command and Control on August 4

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News