Saturday, December 21, 2024

హైదరాబాద్ అంటే.. అంబేద్కర్ స్టాచ్యూ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యం త ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రపంచ ప ర్యాటకులకు అమెరికా అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎలా గుర్తు కు వస్తుందో.. హైదరాబాద్ అంటే అంబేద్కర్ స్టాచ్యూ గుర్తు కు వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం భారీ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించింది. ప్రజాస్వామ్యానికి చిహ్నంగా నిర్మించబ డిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సన్నగా ఉండే రాగి పొరతో కప్పబడి న ఈ విగ్రహం 879 అడుగుల ఎత్తులో 305 అడుగుల పొడ వు, 35 అడుగుల నడుము ఉంది. లేడీ లిబర్టీ ధరించిన షూ సైజు 879 కావడం గమనార్హం. ఆఫ్ లిబర్టీని అక్టో బర్ 28, 1886లో ఏర్కాటు చేశారు.

కాగా తెలంగాణ ప్రభుత్వం 125 అడుగుల ఎత్తు, 45.5 అడుగుల వెడల్పుతో దేశంలోనే అతి పెద్ద విగ్రహాన్ని నిర్మించింది. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2016లో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నగరం నడిబొడ్డున నిర్మించిన ఈ భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు . ఇప్పటికే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు.

Also read: వేధింపులు తాళలేక విలేకరి ఆత్మహత్య

విగ్రహ ఆవిష్కరణ అనంతరం జరిగే సభలో ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్, ముఖ్య అతిథి ప్రకాష్ అంబేద్కర్ ప్రసంగించనున్నారు. కాగా అంబేద్కర్ విగ్రహా బేస్ మెంట్ ఎత్తు 50 అడుగులు కాగా వెడల్లు 45.5 అడుగులు, విగ్రహ ఏర్పాటుకు 791 టన్నుల స్టీల్, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడిని వినియోగించారు. ప్రకృతి వైపరిత్యాలను తట్టుకునేలా విగ్రహం రూపకల్పన జరిగింది. దీని కోసం రూ. 146.50 కోట్లు వెచ్చించారు. 425 మంది శ్రామికులు రేయింబవళ్ళు పనిచేశారు. కార్యక్రమంలో శాసన సభ స్పీకర్, మండలి చైర్మన్, ఎంపీలు, మంత్రులు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు, కార్పొరేషన్ చైర్మన్‌లు, జెడ్‌పి చైర్మన్‌లు, నగర మేయర్, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News