Monday, December 23, 2024

హస్తినలో ఆత్మగౌరవ బొడ్రాయి

- Advertisement -
- Advertisement -

దేశమంతా గులాబీ పరిమళాలు వెదజల్లే వేదిక ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) భవన్ రూపుదిద్దుకున్నది. హస్తినలో ఆత్మగౌరవ బొడ్రాయి. అస్తిత్వ పతాక. దేశ గౌరవానికి ప్రతీకగా నిలిచేలా, రాష్ట్రాల హక్కుల కోసం సాగించే చర్చలకు, దేశ ప్రజల ఆకాంక్షల కోసం సమాలోచన చేసే వేదికగా బిఆర్‌ఎస్ భవన్ నిలవబోతున్నది. ఢిల్లీలోని వసంత విహార్‌లో బిఆర్‌ఎస్ భవన్ నిర్మాణం పూర్తి అయింది. నేడు బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించనున్నారు. దేశ హితం కోసం కెసిఆర్ అడుగు. దేశ ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దే మహోజ్వల శక్తి బిఆర్‌ఎస్ చరిత్రాత్మక సమాలోచన దిశగా పురుడు పోసుకుంది. దేశ అస్తిత్వాన్ని ఇనుమడింపజేసే వేదిక కెసిఆర్ ‘కల’ దేశం కోసం ఢిల్లీ గడ్డపై దేశ ప్రగతి గులాబీ పతాక ప్రజ్వలించింది. భారత రాష్ట్ర సమితి పార్టీ జాతీయ వేదిక భవన్ ప్రారంభమవుతున్నది. దేశ గౌరవానికి ప్రతీకగా నిలిచేలా బిఆర్ ఎస్ కార్యకలాపాలు దేశ వ్యాప్తంగా ముందుకు పోనున్నాయి. ఢిల్లీ నుండి ఇక దేశ ప్రజల ఆకాంక్షల కోసం దేశంలో బిఆర్‌ఎస్ గాలి వీయనున్నది. రాజ్యాంగేతర శక్తులపై సమర భేరి పతాక.
తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమానికి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ కేంద్రంగా ఉంది. ఎన్నో ఉద్యమ పాఠాలు, వ్యూహాలు, అస్తిత్వ పునాదులను నిలబెట్టిన ఘనత హైదరాబాద్ తెలంగాణ భవన్‌కు దక్కుతుంది. 2001 ఏప్రిల్ 27న కెసిఆర్ నాయకత్వంలో జలదృశ్యంలో గులాబీ జెండా రెపరెపలాడింది. కొండా లక్ష్మన్ బాపూజీ ఇల్లు టిఆర్‌ఎస్ మొదటి వేదిక అయ్యిం ది. కెసిఆర్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్న సమయంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తన విషపూరిత చర్యలతో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం లేకుండా జలదృశ్యం నుంచి ఖాళీ చేయించారు. అనంతరం కృష్ణానగర్‌లో కొద్ది రోజులు టిఆర్‌ఎస్ ఆఫీసు నడిచింది. తెలంగాణ ప్రజలు అస్తిత్వం కాపాడుకు నేందుకు సొంత కార్యాలయం ఉండాలని తెలంగాణ భవన్ నిర్మాణం చేపట్టారు కెసిఆర్. పార్టీ కార్యాలయం అంటే ఉద్యమ భావజాలానికి గ్రంథాలయంలా ఉండాలనేలా హైదరాబాద్ నడి బొడ్డున చరిత్రాత్మక తెలంగాణ భవన్‌ను నిర్మించారు. ఉద్యమాన్ని పతాక స్థాయికి వెళ్ళింది.
అకుంఠిత దీక్షతో..
కెసిఆర్ మొక్కవోని దీక్షతో శాంతియుతంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. తన మేధో సంపత్తిని పాయలుగా విభజించి తెలంగాణ ఉద్యమాన్ని నలుదిశలా వ్యాపింపజేసి పోరాటాన్ని పతాక స్థాయికి చేర్చారు. ఢిల్లీ గడపలో ప్రతి పార్టీ ఆఫీసు తలుపు తట్టి, తెలంగాణకు జై కొట్టించి దేశంలో అనేక పార్టీల మద్దతు లేఖలు తెచ్చి తెలంగాణకు రూపం వచ్చేలా చేశారు. జంతర్ మంతర్ వద్ద దీక్ష చేశారు. ఆ సమయంలో ఢిల్లీకి పోతే నిలవడానికి నీడ లేకుండా ఉండేది. కెసిఆర్ ఎంపిగా ఇచ్చిన ఇల్లే ఢిల్లీలో తెలంగాణ ఉద్యమానికి వేదిక అయ్యింది. అందుకే హైదరాబాద్‌లో లాగే ఢిల్లీలోనూ ఒక భవనం నిర్మించాలని ఆలోచన చేసిండ్రు. ఇపుడు భవనం నిర్మాణం పూర్తి చేసుకుంది. ఢిల్లీలో నిర్మించిన బిఆర్‌ఎస్ భవన్ భారత జాతిని జాగృత పరచడానికి వేదిక కానుంది. ఢిల్లీలో బిఆర్‌ఎస్ అంటే భారత జాతీయ రాజకీయాలలో సరికొత్త విప్లవానికి పునాది.
తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడినట్టే, భారత దేశ ఔన్నత్యాన్ని, అస్తిత్వాన్ని అన్ని వర్గాల ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే దిశగా పయనం సాగుతున్నది. ఈవేదిక జాతీయ రాజకీయాలకు ఉద్యమ పాఠాలు నేర్పుతుంది. చరిత్ర అంటే బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల ఉచిత కరెంట్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, దళిత బంధు, కెసిఆర్ మేధో మథనం నుండి జాలువారిన చరిత్రాత్మక ప్రగతి పథకాలు దేశం అంతటా అమలుకు వస్తే దేశ ముఖ చిత్రమే మారనుంది.
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ బాటలో కెసిఆర్ నడుస్తున్నారు. ఉద్యమ పతాక.. నిన్న మొన్న కెసిఆర్ ఆవిష్కరించిన చరిత్ర సాక్ష్యాలు.. మన ఆత్మగౌరవం ఆకాశమంత ఎత్తుకు నిలిపారు కెసిఆర్. దేశానికి ఆదర్శంగా ప్రజాస్వామ్య ప్రగతి పతాక అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయం నూతన భవనం ప్రారంభం చేసుకున్నాం. విశ్వవిజ్ఞాన కల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. మరో పక్క జూన్ 2న తెలంగాణ అమర వీరుల స్ఫూర్తి జ్యోతి వెలుగునున్నది. పోరాటంతో సాధించుకున్న తెలంగాణలో ఇవన్నీ చరిత్రలో ఆత్మగౌరవ సాక్ష్యాలు. కెసిఆర్ అంబేడ్కర్ బాట లో దేశానికి కొత్త క్రాంతి నివ్వనున్నరు. తెలంగాణలో అద్భుత పాలన కొనసాగిస్తూ.. అటు నిత్యం బిఆర్‌ఎస్ పార్టీ కార్యకలపాలను విస్తృతం చేస్తున్నరు. ఖమ్మంలో కదం తొక్కిన బిఆర్‌ఎస్ పార్టీ ప్రభంజనం.. మహారాష్ట్ర వైపు దూసుకెళ్లింది. ఢిల్లీలో బిఆర్ ఎస్ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం విప్లవం వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News