Tuesday, January 21, 2025

సచివాలయంలో గుడి, చర్చి, మజీద్ లను ప్రారంభించనున్న సిఎం కెసిఆర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సచివాలయంలో గుడి, మజీద్, చర్చి లను ఈనెల 25న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభిచనున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో గుడి, మజీద్, చర్చి పనులను పలువురు అధికారులతో కలిసి శుక్రవారం ఉదయం ఆర్ అండ్ బి ఇఎన్సీ గణపతి రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు పనులు పూర్తి కావచ్చాయని తెలిపారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గుడి, మజీద్, చర్చి పనులను పరిశీలించామని, చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయని.. అవి కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తి అవుతాయని చెప్పారు. మత పెద్దలు, పూజారుల సలహాలు సూచనలు పాటిస్తూ నిర్మాణం చేశామని పేర్కొన్నారు. సచివాలయం ఉద్యోగులకు ఈనెల 25 నుంచి భక్తులకు గుడి అందుబాటులోకి రానుందని.. మజీద్, చర్చి కూడా అదే రోజు ప్రారంభమవుతుందని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News