Saturday, November 9, 2024

నేడు రెండు జిల్లాలకు సిఎం

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల పర్యటనకు రానున్నారు. అయా జిల్లా కేంద్రాల్లోని నూ తనంగా నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయాలను సిఎం ప్రా రంభించనున్నారు. కొత్తగూడెం నుంచి పాల్వంచ వెళ్లే ప్రధా న జాతీయ రహదారి పక్కనే ఉన్న నూతన సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాన్ని కెసిఆర్ ప్రారంభించనున్నారు. అదేవిధంగా మానుకోటలో కలెక్టరేట్‌ను ఆయన ప్రారంభిస్తా రు. నూతన జిల్లాల ఏర్పాట్లలో భాగంగా ప్రజలకు పరిపాలన పారదర్శకంగా, సౌలభ్యకరంగా అందుబాటులో ఉండాలనే లక్షంతో ప్రతీ జిల్లాకు ఓ కలెక్టర్ కార్యాలయం ఏర్పా టు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది.

ఇందులో భాగం గా రూ.57కోట నిధులతో సకల సౌకర్యాలు, విశాలమైన గదులు, ఆధునిక హంగులు, చుట్టూ అందమైన హరితవనం నందన వనాన్ని తలపించేలా రూపుదిద్దిన కలెక్టరేట్లు చూడముచ్చటగా రెవెన్యూ, ఆర్‌అండ్‌బి అధికారులు తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా రెండు కలెక్టరేట్‌లను ఆయా ప్రాంతాల్లో ప్రారంభించిన అనంతరం అక్కడ ప్రజలను ఉద్దేశించి ఏర్పా టు చేసిన వేదిక వద్ద కెసిఆర్ మాట్లాడనున్నారు. దాంతోపా టు కొత్తగూడెం ఎల్‌ఐసి కార్యాలయం సమీపంలో ఏర్పాటుచేసిన పార్టీ జిల్లా కార్యాలయాన్ని, మానుకోటలో బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని కూడా కెసిఆర్ ప్రారంభిస్తారు. ఇందుకోసం అటు కొత్తగూడెం, మానుకోటలో పార్టీ శ్రేణు లు ఏర్పాటుచేశారు. ప్లెక్సీ లు, కటౌట్లతో అయా ప్రాంతాలు గులాబీమయంగా మారిపోయాయి.

ఇదిలా ఉండగా మానుకోటలో కెసిఆర్ సభా వేదిక, హెలీప్యాడ్‌ను మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ఎంపి మాలోతు కవిత, జడ్‌పి చైర్‌పర్సన్ కుమారి అంగోతు బిందు, ఎంఎల్‌ఎ బానోత్ శంకర్‌నాయక్, ఎంఎల్‌సి తక్కెళ్లపల్లి రవీందర్‌రావుతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News