Friday, December 20, 2024

కాసేపట్లో కేజ్రీవాల్ నివాసానికి సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR to Kejriwal residence for a while

న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన కొనసాగుతోంది. కాసేపట్లో ఢిల్లీ సిఎం కెజ్రీవాల్ నివాసానికి కెసిఆర్ వెళ్లనున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత కెసిఆర్, కేజ్రీవాల్ చండీగఢ్ వెళ్లనున్నారు. సాగుచట్టాలపై పోరులో అమరులైన రైతు కుటుంబాలను సిఎం పరామర్శించనున్నారు. అమరులైన రైతు కుటుంబాలకు ఆయన ఆర్థికసాయం చేయనున్నారు. 600 కుటుంబాలకు ఆర్థిక సహకారం అందివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ పాల్గొనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News