Saturday, November 16, 2024

రాష్ట్రమంతటా గులాబీ హోరు

- Advertisement -
- Advertisement -

ఈ నెల 16న ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ప్రచార శంఖం పూరించనున్నారు. ఓరుగల్లు కేంద్రంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతి రూపం సంక్షేమ పథకాల మేనిపెస్టో విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ సిక్సర్‌కు బౌన్సర్ కొట్టే విధంగా అసలైన, అద్భుతమైన సరికొత్త పథకాలు ప్రకటిస్తారు. కెసిఆర్ ప్రకటించే మేనిపెస్టో చూస్తే ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్నాయి. తెలంగాణ ప్రగతి సంక్షేమం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో నీళ్ళ ఊటకు కరువు లేదు. ఎక్కడ చూసిన జల వనరులు ఉప్పొంగి ప్రవహిస్తోంది.

తెలంగాణ గులాబీ వనం. ప్రతి ఊరు, ప్రతి వాడ, పట్టణం, గల్లీ గులాబీ లోగిళ్ళు. బొడ్డెమ్మ ఉదయించింది. బతుకమ్మ బోనం ఎత్తుకోనున్నది. దసరా ఉత్సవాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ గుబాళింపు. సిఎం కెసిఆర్ హ్యాట్రిక్ విజయం ఖాయం. జనాభినేతకు జయహో అంటున్న ప్రజాభిమానం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ సోమవారం విడుదల కావడంతో పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్ళాయి. నవంబర్ 30న ఎన్నికలు. దీంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రచారంలో బిఆర్‌ఎస్ ముందుంది. గత ఆగస్టు నెల 21న బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ 115 మంది ఎంఎల్‌ఎ అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల కార్యక్రమాల్లో పరుగులు పెడుతున్నాయి. పదేండ్ల ప్రగతిపథం ఎన్నికల నినాదం. సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమం అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు ప్రతి ఇంటికీ చేరాయి. మళ్ళీ సిఎం కెసిఆర్ సార్ రావాలని తెలంగాణ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. అరవై యేండ్ల పాలనకు పదేండ్లు కెసిఆర్ పాలనకు దున్యా ఫరక్ ఉంది. పదేండ్లలో వంద ఏండ్ల ప్రగతి సాధించినట్టు ఉంది. కెసిఆర్ అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలే ఓట్ల వర్షం కురిపిస్తుంది.

ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యూహం, దిశా నిర్దేశంతో గత 20 రోజులుగా విరామం లేకుండా మంత్రులు కెసిఆర్, హరీశ్ రావులు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. జిల్లాల్లో పర్యటిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలు చుట్టేస్తున్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలను, నాయకులకు చుక్కలు చూపిస్తున్నారు. గులాబీ ప్రచార హోరు హోరెత్తిస్తున్నారు. తెలంగాణమంతా గులాబీ పవనాలు వీస్తున్నాయి. ఎక్కడ చూసిన కారు స్పీడు గులాబీ హోరు కనిపిస్తున్నది. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బిజెపి పార్టీలకు అందనంత దూరంలో బిఆర్‌ఎస్ దూసుకుపోతున్నది. మంత్రులు హరీశ్ రావు ఒక వైపు, కెటిఆర్ మరో వైపు, అటు ఎంఎల్‌సి కవిత జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నికల వాతావరణం వేడెక్కించారు. ఇప్పటికే కెటిఆర్ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, హరీశ్ రావు మెదక్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తుండటంతో ఎన్నికల సందడి నెలకొన్నది. అటు కవిత నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. గత 20 రోజులుగా కెటిఆర్, హరీశ్‌రావు, కవిత అన్ని గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా పర్యటిస్తూ అసెంబ్లీ ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్నారు. మాటల తూటాలతో ప్రతిపక్ష పార్టీలపై మంత్రులిద్దరూ విరుచుకుపడుతున్నారు.

మంత్రులు హరీశ్, కెటిఆర్‌ల ప్రసంగాలు వింటుంటే కాంగ్రెస్, బిజెపి గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. బిఆర్ ఎస్ ఎంఎల్‌ఎ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. బిఆర్‌ఎస్ ప్రచార హోరుకు దరిదాపుల్లో కూడా కాంగ్రెస్, బిజెపిలు కన్పించడం లేదు. కనీసం వాళ్ళు అభ్యర్థులను వెతుక్కోవాల్సి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. హైదరాబాద్ ఢిల్లీ విమానాల్లో కాలం గడుపుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడేటప్పటికి వారికి అభ్యర్థులే దొరకని పరిస్థితినెలకొంది. బిఆర్‌ఎస్ ప్రచార దూకుడుకు కాంగ్రెస్, బిజెపిల నాయకులు బెంబేలెత్తి పోతున్నారు. బిఆర్‌ఎస్ అధినేత సిఎం కెసిఆర్ ప్రచార రంగంలోకి దిగితే అసలు ఆట మొదలవుతుంది. మంత్రులిద్దరి ప్రచార హోరుకు తట్టుకోలేకపోతుంటే కెసిఆర్ రంగంలోకి దిగితే ప్రతిపక్షాలు ముల్లె మూట సర్దుకోవాల్సిందే.

ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు వారెంటీ లేనివి, నమ్మితే మోసపోతాం, గోసపడతాం, కాంగ్రెస్‌ను నమ్మితే కుక్క తోక పట్టుకుని గోదాట్లో ఈదినట్లే. ఇక బిజెపికి దిక్కుమొక్కు లేదు. వారికి అభ్యర్థులే లేరు. మనతో పోటీపడే సత్తా వారికి లేదంటూ మంత్రులు కెటిఆర్, హరీశ్‌లు స్పీచ్ పంచ్‌లతో కాంగ్రెస్, బిజెపిలను ఆటాడుకుంటున్నారు. మంత్రులిద్దరూ బుల్లెట్ వేగంతో ప్రచారాస్త్రాలు సంధిస్తుంటే బిక్కమొహం వేసుకుంటున్నారు. పంచ్‌ల ప్రవాహం ప్రవహిస్తున్నది. జనాన్ని ఆలోచింప చేస్తున్నది. కెసిఆర్ మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి అని ప్రచార పర్వాన్ని పదునెక్కిస్తున్నారు. పదేండ్లుగా ప్రధానికి మొర పెట్టుకున్న పట్టించుకోని మోడీ పసుపు బోర్డు, గిరిజన యూనివర్శిటీ, కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవన్నీ ఎన్నికల స్టంట్. గత పదేండ్లు కేంద్రం నుంచి రావాల్సిన వాటా, పలు ప్రాజెక్టుల కోసం సిఎం కెసిఆర్ నాయకత్వంలో పోరాడుతున్నాం. మన పోరాటంతోనే దిగివచ్చారు. ఎన్నికల వచ్చాయని ఆగమేఘాల మీద మోడీ ప్రకటించారంటూ ప్రచారంలో బిజెపి మోసపూరిత విధానాలను మంత్రి కెసిఆర్, హరీశ్‌రావులు ఎండగడుతున్నారు. అరవై ఏండ్లు పట్టించుకోని కాంగ్రెస్ అమలు కానీ, అమలు చేయాలని వారంటీ లేని గ్యారెంటీ కార్డులంటూ ప్రజలను బురడి కొట్టిస్తారని కాంగ్రెస్, బిజెపి పార్టీల ద్వంద్వ నీతిని ప్రజలకు వివరిస్తున్నారు.

కాంగ్రెస్, బిజెపిల కంటే మించిన మేనిపెస్టో పేద ప్రజల గుండెల్లో నిలిచే పథకాలు రాబోతున్నాయి. సిఎం కెసిఆర్ త్వరలో తెలంగాణ ప్రజలకు వరాల సంక్షేమ మూట ప్రకటిస్తారంటూ మంత్రులు కెటిఆర్, హరీశ్, ఎమ్మెల్సీ కవిత ప్రజలతో మమేకం అవుతున్నారు. యువ నేతలకు తోడుగా లక్షలాది మంది గులాబీ దండు కదులుతున్నారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ప్రచార శంఖం పూరించనున్నారు. ఓరుగల్లు కేంద్రంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతి రూపం సంక్షేమ పథకాల మేనిపెస్టో విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ సిక్సర్‌కు బౌన్సర్ కొట్టే విధంగా అసలైన, అద్భుతమైన సరికొత్త పథకాలు ప్రకటిస్తారు. కెసిఆర్ ప్రకటించే మేనిపెస్టో చూస్తే ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్నాయి. తెలంగాణ ప్రగతి సంక్షేమం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో నీళ్ళ ఊటకు కరువు లేదు. ఎక్కడ చూసిన జల వనరులు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పచ్చని పంటలతో తెలంగాణ అలరారుతున్నది. అనేక సంక్షేమ పథకాలతో ప్రతి ఇల్లు సుఖశాంతులతో వర్ధిల్లుతున్నది. ఎన్నో మానవీయ కోణాల పథకాలను సిఎం కెసిఆర్ అందిస్తున్నారు.

మొన్ననే బడి పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 20 లక్షల మంది ప్రభుత్వ బడుల్లో చదువుకునే బిడ్డలకు పౌష్ఠికాహారంతో కూడిన బలవర్ధకమైన టిఫిన్స్ అందిస్తున్నారు. పిల్లల భవితకు ఆరోగ్య వరాన్ని అందించారు. ఆసరా, పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్, రైతు బంధు, దళిత బంధు, బిసి, మైనార్టీలకు సాయం, గృహ లక్ష్మీ, ఆరోగ్య లక్ష్మీ వంటి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అందిస్తున్న గొప్ప మానవీయతున్న సిఎం కెసిఆర్. మొన్నటి మొన్న ఆర్‌టిసి కార్మికుల కుటుంబాల్లో వెలుగు నింపారు. సింగరేణి కార్మికుల్లో సంతోషం నింపారు. సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న ప్రతి పథకం ప్రజల ఆకాంక్షలకు ప్రతి రూపంగా తన గుండె నుండి వచ్చే స్పర్శ సంక్షేమ పథకాలు. బిడ్డల మనసు ఎందో తండ్రికెరుక. తెలంగాణ బిడ్డల్ని సిఎం కెసిఆర్ తండ్రి బాధ్యత ఎత్తుకుని తన ఒడిలో సంక్షేమ ఊయల ఊపుతున్నారు. తెలంగాణ పెద్దగా, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వైపు ఉంటాం. ఇది తెలంగాణ జనం గుండె. నాలుగు కోట్ల జనాభినేత కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ సల్లంగా, సంతోషంగా ఉంటుంది. ఇది తెలంగాణ ప్రజల హృదయ స్పందన ఓట్ల రూపంలో ఎలుగెత్తి చాటెందుకు సిద్ధమైంది.

చిటుకుల మైసారెడ్డి
9490524724

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News