Monday, January 20, 2025

‘3’టిమ్స్‌లకు 26న సిఎం భూమిపూజ

- Advertisement -
- Advertisement -

ఇప్పటికే రూ.2,679కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు

కరోనా ఉధృతిలో గచ్చిబౌలిలో
మొదటి టిమ్స్ ఏర్పాటు కొత్తగా
నెలకొల్పే మూడింటితో హైదరాబాద్
నగరం నలుమూలలా నాలుగు
సూపర్ స్పెషాలిటీలు జనాభా
పెరగడంతో ఆస్పత్రులపై పెరిగిన
ఒత్తిడి ఉమ్మడి రాష్ట్రంలో
హైదరాబాద్‌లో ఒక్క కొత్త
పెద్దాస్పత్రి నిర్మాణామూ జరగలేదు
ఒక్కో టిమ్స్‌కు 13.71లక్షల చ.అ.
విస్తీర్ణం.. పడకలు టిమ్స్‌ల
ఏర్పాటుతో ఉస్మానియా,
నిమ్స్‌లపై తగ్గనున్న ఒత్తిడి

మన తెలంగాణ: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో మూడు సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులు నిర్మాణ పనులకు ఈనెల 26న సిఎం కెసిఆర్ భూమి పూజ చేయనున్నారు. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) పేరుతో ని ర్మించే మూడింటి నిర్మాణానికి రూ. 2,679 కోట్లతో పరిపాలన అనుమతులను ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిన విషయం విదితమే. రాష్ట్రంలో క రోనా ఉధృతి సమయంలో గచ్చిబౌలి లో టిమ్స్‌ను ఏర్పాటు చేసి సేవలందించగా, నూతనం గా నిర్మించ తలపెట్టిన మూడింటితో కలిపి టిమ్స్ దవాఖానల సంఖ్య నాలుగుకు చేరుకోనుంది. నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రుల్లో దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలు వైద్య సేవలు పొందుతున్నారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రులలో వైద్య సేవల కోసం రాష్ట్ర ప్రజల తో పాటు ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో వస్తుండడంతో ఆయా ఆసుపత్రులపై రోగుల ఒత్తిడి పెరుగుతోంద ని వైద్య శాఖ ఉన్నతాధికారులు తరచూ పేర్కొంటున్నారు. జనాభా అంతకంతకు పెరిగినా ఈ ఆస్పత్రులపై భారం గణనీయంగా పెరుగుతునప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క పెద్దాసుపత్రి నిర్మాణం జరుగలేదు. ఈక్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ఒకటి, రెండు కాదు ఏకంగా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు హైదరాబాద్ మహా నగరం వేదికగా మారుతోంది.

ఈ నేపథ్యంలో ఒక్కో దవాఖానను 13.71 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిచడంతో పాటు ఆయా ఆసుపత్రులలో వెయ్యి పడకలు ఉండేలా ఏర్పాటు చేపట్టనున్నారు. అలాగే వైద్య విద్య కోసం పిజి, సూపర్ స్పెషాలిటీ సీట్లు అందుబాటులోకి తేనున్నారు. వీటికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఇన్ నర్సింగ్, పారామెడికల్ విద్యకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ముఖ్యంగా అల్వాల్‌లో మొత్తం విస్తీర్ణం: 28.41 ఎకరాలలో రూ. 897 కోట్ల వ్యయంతో 13.71 చదరపు అడుగుల స్థలంలో ఐదు అంతస్థుల భవనం నిర్మాణం జరుగనుంది. అలాగే ఎల్‌బి నగర్‌లో 21.36 ఎకరాలలో 13.71 లక్షల చదరపు అడుగులలో రూ. 900 కోట్ల వ్యయంతో 14 అంతస్థుల ఆసుపత్రి, సనత్ నగర్‌లో 17 ఎకరాల విస్తీర్ణంలో 1371 లక్షల చదరపు అడుగుల స్థలంలో రూ. 882 కోట్ల వ్యయంతో 14 అంతస్థుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి సిఎం కెసిఆర్ భూమి పూజ చేయనున్నారు. కాగా సిఎం భూమి పూజ కార్యక్రమానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

గాంధీ, నిమ్స్, ఉస్మానియాలపై..

ఎల్‌బి నగర్, సనత్ నగర్, అల్వాల్‌లలో సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు నిర్మాణం పూర్తయితే పెద్ద సంఖ్యలో రోగులకు వైద్య సేవలు అందిస్తోన్న గాంధీ, ఉస్మానియా, నిమ్స్ లపై ఒత్తిడి తగ్గనున్నట్లు వైద్య శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. గచ్చిబౌలి, అల్వాల్, సనత్ నగర్, ఎల్‌బి నగర్ లలో నిర్మించే ఈ ఆసుపత్రుల నిర్మాణం వల్ల జిల్లాల నుంచి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించవచ్చని వివరించారు. అల్వాల్ లో ఏర్పాటు చేసే ఆసుపత్రికి సంగారెడ్డి, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చే రోగులు చక్కటి వైద్యం పొందే అవకాశం ఉందని, అదే రీతిలో ఎల్‌బినగర్ ఆసుపత్రి కి ఖమ్మం, నల్గొండ, సూర్యపేట జిల్లాల నుంచి రోగులు వైద్యం పొందే వీలుంటుందన్నారు.

గచ్చిబౌలి, సనత్ నగర్ ఆసుపత్రులకు దగ్గరి జిల్లాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని, గతంలో ఏదైనా అత్యవసర వైద్య సేవలు కావాలంటే నిమ్స్ కో, గాంధీకో తరలించాల్సిన పరిస్థితి కొంతమేర తగ్గుందన్నారు. ఈ ట్రా ఫిక్ కారణంగా అందాల్సిన వైద్యం సకాలంలో అందరు రోగులు చనిపోయిన సందర్బాలు ఉన్నాయి. నగరంలో సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రుల నిర్మాణం పూర్తయితే జిల్లాల నుంచి అత్యవసర వైద్య సాయం కావాల్సిన రోగులకు ట్రాఫిక్ బెడద లేకుండా నగర శివార్లలోనే అత్యుత్తమ అత్యవసర వైద్య సేవలు అందించే అవకాశంతో పాటు గాంధీ, నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రులకు రోగుల ఒత్తిడి తగ్గుముఖం పడుతుందని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News