Monday, December 23, 2024

రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్న సిఎం కెసిఆర్..

- Advertisement -
- Advertisement -

CM KCR to Tour Narsampet on Jan 18

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సోమవారం ప్రగతిభవన్‌లో ప్రారంభమైన రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితితోపాటు పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై కూడా కేబినెట్ చర్చించినట్లు సమాచారం. అకాల వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్న మిర్చి, మొక్కజొన్న ఇతర పంటలకు నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గం, పరకాల నియోజకవర్గాలల్లో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో మంగళవారం సిఎం కెసిఆర్ నర్సంపేటలో పర్యటన చేపట్టనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు సిఎం కెసిఆర్ తో పాటు పర్యటనలో పాల్గొననున్నారు.

CM KCR to Tour Narsampet on Jan 18

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News