- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కాసేపట్లో సికింద్రాబాద్ గాంధీఆస్పత్రికి వెళ్లనున్నారు. అక్కడ కరోనా పేషెంట్లతో మాట్లాడనున్నారు. గాంధీలో కోవిడ్-19 చికిత్స, సదుపాయాలపై అధికారులతో సమీక్షించనున్నారు. ఆక్సిజన్, ఔషదాల లభ్యతను పరిశీలించనున్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం సిఎం కెసిఆర్ వైద్య ఆరోగ్యశాఖను పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సిఎం హోదాలో కెసిఆర్ తొలిసారి గాంధీ దవాఖానకు వెళ్తున్నారు.
CM KCR To Visit Gandhi Hospital
- Advertisement -