- Advertisement -
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో ఇటీవల కురిసిన వడగండ్ల వానతో తీవ్రంగా పంట నష్టపోయిన రైతులను కలిసేందుకు గురువారం జిల్లాకు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటనను పురష్కారించుకుని, బుధవారం పోలీస్ కమిషనర్, అదనపు కలెక్టర్లతో కలిసి రామడుగు మండలంలో పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. పంటనష్టంపై సమగ్ర నివేదికతో అధికారులు సిద్ధంగా ఉండాలని, ముఖ్యమంత్రి జిల్లాకు చేరుకొని తిరిగి వెళ్లెవరకూ పక్క ప్రణాలికను రూపొందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్లు జి.వి. శ్యామప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, వ్యవసాయ అధికారి శ్రీధర్, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, ఇరిగేషన్ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -