Sunday, December 22, 2024

19న మెదక్‌కు సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మెదక్ : పరిపాలన సౌలభ్యం కోసం ఉమ్మడి పది జిల్లాలను 33 జి ల్లాలుగా ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రంలో స మీకృత కలెక్టరేట్‌తోపాటు ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు చేరువలో ప్రభుత్వం ఉం డాలనే యోచనతో ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయం అభివృద్ధికి బాటలు వేసింది. జి ల్లా కార్యాలయాలతో జిల్లా కేంద్రం కొత్త రూపురేఖలు దాల్చుకుని అన్ని హంగులతో అభివృద్ధి వై పు పరుగులు తీస్తుండటంలో అతిశయోక్తి లేదని జిల్లా వాసులు ఆనందోత్సవాల్లో తేలియాడుతున్నారు.

ఈనెల 19న నూతన సమీకృత కలెక్టరేట్ భవనంతోపాటు ఎస్పీ కార్యాలయం, బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభోత్సవం చేయడానికి స్వయంగా ముఖ్యమంత్రే రానున్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. అందులో భా గంగానే సోమవారం మంత్రి హరీశ్‌రావు, స్థానిక శాసనసభ్యురాలు పద్మాదేవేందర్‌రెడ్డితోపాటు ఎ మ్మెల్యే మదన్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్, జడ్పీ చైర్‌పర్సన్ హేమలత శేఖర్‌గౌడ్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శినిలతో కలిసి నూతనం గా నిర్మించిన కలెక్టరేట్ భవనంలో కలియతిరిగారు.

పనుల పురోగతి, ఇంకా పూర్తి కాని పను లు ప్రారంభోత్సవంలోగా పూర్తి కావాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసి ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభ జరిగే ప్రదేశాన్ని పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా భద్రత అధికారులను ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలు చాలా వేగంగా అభివృద్ధి చెందాయని తె లిపారు. ఈనెల 19న కెసిఆర్ జిల్లాలో పర్యటిం చి కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్‌ఎస్ కార్యాలయాలను ప్రారంభించి అనంతరం జరిగే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. ఈ సభకు దాదాపు లక్షకుపైగా ప్రజలు పాల్గొననున్నారని అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ విషయమై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా పాల్గొన్న ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించి అన్ని ఏర్పాట్లను పరిపూర్ణంగా నిర్వహించాలని సూచించారు. అదే సమయం లో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని బహిరంగ సభ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న మంత్రి కెటిఆర్ మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకొగా స్థానిక ఎమ్మెల్యే పుష్పగుచ్ఛం అందజే సి ఆహ్వానించారు. అనంతరం ప్రజాప్రతినిధుల తో జరుగుతున్న సమావేశంలో కేవలం ఐదు ని మిషాలు కేటాయించి 19న జరగబోయే సభ విజయవంతం కావాలని మంత్రి కెటిఆర్ సూ చించి వెళ్లిపోయారు.

ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూసిన మెదక్ జిల్లా కేంద్రం కల నెరవేర్చిన ఘనత సిఎం కెసిఆర్‌దేనని కొనియాడుతూ మెద క్ పట్టణం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్ని వైపులా నాలుగు లైన్ల జాతీయ రహదారులు మంజూరై వాటి పనులు కూడా వేగవంతం గా జరుగుతున్నాయన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే బిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అ న్ని నియోజకవర్గాల, మండలాల జడ్పీటీసీలు, ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లతోపాటు ప లువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News