Sunday, December 22, 2024

ఎల్లుండి మేడారం జాతరకు సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -
CM KCR to visit Medaram jatara
21న నారాయణఖేడ్‌లో సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి కెసిఆర్ శంకుస్థాపన
23వ తేదీన మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను ప్రారంభించనున్న కెసిఆర్

హైదరాబాద్: ఈ నెల 18న(శుక్రవారం) ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మేడారం జాతరకు వెళ్లనున్నారు. వన దేవతలైన సమ్మక్కసారలమ్మకు కెసిఆర్ బంగారం సమర్పించి, మొక్కులు చెల్లించుకోనున్నారు. మేడారం జాతర 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. ఈ జాతరకు దాదాపు కోటిమందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. సిఎం కెసిఆర్ పర్యటన నేపథ్యంలో సిఎస్ సోమేశ్‌కుమార్, డిజిపి మహేందర్‌రెడ్డితో పాటు మంత్రులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక సిఎం కెసిఆర్ 20వ తేదీన ముంబయికి వెళ్లనున్నారు. మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ థాకరేతో భేటీ కానున్నారు. ఈ నెల 21న నారాయణఖేడ్‌లో సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి కెసిఆర్ శంకుస్థాపన చేయనున్నారు. 23వ తేదీన మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను కెసిఆర్ ప్రారంభించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News