Sunday, January 19, 2025

CM KCR: కౌలు రైతులను కూడా ఆదుకుంటాం: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భూగర్భ జలాలు బాగా పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్(CM KCR) తెలిపారు. వర్షప్రభావిత ప్రాంతాల్లో గురువారం సిఎం పర్యటిస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ శివారులో వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంటల వివరాలను కలెక్టర్ సిఎం కెసిఆర్, వ్యవసాయశాఖ మంత్రికి తెలిపారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఎం(KCR) మాట్లాడుతూ…. ఒక్కసారి వర్షం పడి నష్టం జరిగినా తట్టుకుంటానని ఒక రైతు అన్నాడని ఆయన తెలిపారు.

అన్ని జిల్లాల్లో అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం 2.28 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు లెక్క తేలిందని సిఎం కెసిఆర్ తెలిపారు. చాలా మంది రైతులు వందశాతం పంట నష్టపోయారని ఆయన పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో చొప్పదండి ప్రాంతం ఎడారిగా ఉండేదన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల చాలా ప్రాంతాలకు వేసవిలోనూ నీళ్లు వస్తున్నాయి. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున సాయం చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పంట పరిహారం గురించి కేంద్రాన్ని కూడా అడిగేది లేదన్నారు.

గతంలో ఎన్నిసార్లు అడిగినా కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్దారు. పూర్తిగా రాష్ట్రప్రభుత్వ నిధులతో రైతులను ఆదుకుంటామని పేర్కొన్నారు. రైతులకు త్వరలోనే పరిహారం నిధులు అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. కౌలు రైతులను (koulu rythu) కూడా ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని సిఎం చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News