ఉదయం 11గంటల ప్రాంతంలో దత్తత
గ్రామం వాసాలమర్రికి చేరుకోనున్న సిఎం
కెసిఆర్ దళితవాడలో పర్యటన, రైతు
వేదికలో 130మందితో సమావేశం
అనంతరం యాదాద్రి ఆలయ పనుల
పర్యవేక్షణ వాసాలమర్రిని దత్తత తీసుకున్న
తర్వాత సిఎం సందర్శించడం ఇది రెండోసారి
గ్రామ అభివృద్ధి కమిటీల నుంచి ప్రగతి
సమాచారాన్ని సేకరించనున్న ముఖ్యమంత్రి
మన తెలంగాణ/హైదరాబాద్ /యాదాద్రి భువనగిరి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో నేడు మరోసారి పర్యటించనున్నారు. ఈ మేరకు సంబంధిత జిల్లా అధికారులు తగు ఏర్పాట్లు పూర్తి చేశారు. సిఎం రాకతో గ్రామం లో మళ్లీ సందడి వాతావరణం నెలకొన్నది. బుధవారం ఉదయం పదకొండు గంటల సమయ ంలో సిఎం కెసిఆర్ వాసాలమర్రికి చేరుకోనున్నా రు. అక్కడ ఏర్పాటు చేసిన రైతువేదిక భవనంలో ప్రత్యేకంగా గ్రామ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం కానున్నారు. గ్రామ అభివృద్ధిపై గ్రా మ కమిటీల నుంచి తగు వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. ఈ సమావేశం అనంతరం ఎస్‌సి కాలనీలో సిఎం పర్యటిస్తారు. ఆ తర్వాత సర్పం చ్ ఇంట్లో భోజనం చేసిన అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. కాగా వాసాలమర్రి గ్రామానికి గత జూన్ 22న సిఎం కెసిఆర్ తొలిసారిగా పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఊరి ప్రజలకు ఆయన దిశానిర్దేశం చేశారు. పరిశుభ్రత, తాగునీరు, వ్యవసా యం ఇలా అన్నింటికీ కమిటీలు ఏర్పాటు చేసుకుంటే గ్రామం అభివృద్ధి చెందడం పెద్ద కష్టం కాదన్నారు.
వారానికి రెండు గంటల పాటు కష్టపడితే బంగారు వాసాల మర్రిగా తయారు చేసుకోవచ్చని అన్నారు. దీనికి ఊరంతా కలిసి పనిచేయాలని సూచించారు. గ్రామంలో పరస్పర వి బేధాలు, కొట్లాటలు అనేవి లేకుండా చేసుకోవాలన్నారు. ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధి పరిసర గ్రామాలకు ఆదర్శంగా మారాలని ఆకాంక్షించారు. పచ్చదనంతో కళకళలాడాలని అభిలాషించారు. అలాగే ఊర్లోని వాళ్లందరి వివరాలు సేకరించాలని జిల్లా కలెక్టర్‌ను సిఎం ఆదేశించా రు. అందులో వారి ఆరోగ్య, ఆర్థిక వివరాలను కూడా నమోదు చేయాలన్నారు. వాటన్నింటికి పరిష్కారం చూపేలా ఒక కార్యాచరణను సిద్ధం చేయాలని సూచించారు. వాసాలమర్రికి బాధ్యురాలిగా కలెక్టర్‌ను నియమించారు. కాగా ఆగ మ్మ అనే వృద్ధురాలు కెసిఆర్‌కు తన కష్టాలు చెప్పుకున్నారు. పెద్దకొడుకులా బాధలు తీరుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం గ్రామస్తులతో కలిసి సిఎం కెసిఆర్ సహపంక్తి భోజనం చే శారు. ఆ తర్వాత గ్రామసభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ గ్రామా న్ని బంగారు వాసాల మర్రిగా మార్చుతానని అన్నారు. దీని కోసం అవసరమైతే మరో 20సార్లు అయినా వాసాలమర్రికి వస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం బుధవారం వాసాలమర్రిలో సిఎం పర్యటించనున్నారు. కాగా సిఎం మరోసారి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో గ్రామంలో అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెరిగింది. చకచకా పరుగులు పెడుతుండడంతో స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాసాల మర్రి గ్రామాన్ని కెసిఆర్ దత్తత తీసుకోవడమే తాము చేసుకున్న అదృష్టమని పేర్కొంటున్నారు. ఈ గ్రామంలో సిఎం కెసిఆర్ కాలు మోపి నప్పటి నుంచి అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాగే పనులు జరిగితే సిఎం చెప్పినట్లుగా త్వరలోనే బంగారు వాసాల మర్రిగా మారడం ఖాయమని పేర్కొంటున్నారు. ఏ దేమైనప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే తమ గ్రామానికి సరికొత్త వెలుగులు ప్రసాదించిన సిఎం కెసిఆర్‌కు ఊరి ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నేటి పర్యటనలో సిఎం ఇంకా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారో అన్న ఆసక్తి వాసాలమర్రి గ్రామప్రజల్లో నెలకొంది.