మన తెలంగాణ/హైదరాబాద్: రేపు సిఎం కెసిఆర్ వరంగల్, హన్మకొండ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాప్రతినిధులు చేస్తున్న విజ్ఞప్తులు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వరంగల్ దక్షిణ భాగంలో ఔటర్ రింగ్‌రోడ్డు, వరంగల్ జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు, వరంగల్ హన్మకొండ జంటనగరాల రవాణా, అభివృద్ధికి అవరోధంగా ఉన్న రైల్వే ట్రాక్‌ల మీద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఒబి)ల నిర్మాణం, తదితర అభివృద్ధి అంశాలపై స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్ష జరిపి సిఎం కెసిఆర్ మంజూరు చేయన్నారు. వరంగల్ ఇంటర్నల్ రింగ్ రోడ్డు పూర్తి చేసేందుకు చేపట్టవలసిన చర్యలపై వరంగల్ టెక్స్టైల్ పార్క్ పనుల పురోగతి అంశాలను సిఎం సమీక్షించనున్నారు. హన్మకొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ఈ సందర్భంగా కెసిఆర్ ప్రారంభించనున్నారు.
CM KCR to visit Warangal on Nov 10th