- Advertisement -
హైదరాబాద్:ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరికొద్దిసేపట్లో యాదాద్రి పుణ్యక్షేత్రం పర్యటనకు బయల్దేరనున్నారు. ఈరోజు(మంగళారం) ఉదయం 11.30 గంటలకు సిఎం హైద్రాబాద్ నుండి యాదాద్రికి వెళ్లనున్నారు. సిఎం యాదాద్రి పర్యటన నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నీటిని మరోసారి సిఎం కెసిఆర్ పరిశీలించనున్నారు. ఇప్పటికే చినజీయర్ స్వామి నిర్ణయించిన యాదాద్రి పున:ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ఈ పర్యటనలోనే సిఎం కెసిఆర్ స్వయంగా ప్రకటించనున్నారు. యాదాద్రి ఆలయం పున:ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా సిఎం కెసిఆర్ ప్రకటించనున్నారు.
CM KCR to visit Yadadri Temple Today
- Advertisement -