Friday, December 27, 2024

యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు నేడు సిఎం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని దామరచెర్ల మండల పరిధిలో నిర్మాణమవుతున్న యాద్రాద్రి థర్మల్ పవర్ ప్లాం ట్ (అల్ట్రా మేఘా పవర్ ప్లాంట్) పనులను పరిశీలించేందుకు ఆయన జిల్లా పర్యటనకు వస్తున్నారు. ముఖ్యమంత్రిపాటు విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి కూడా సిఎంతో కలిసి ప్లాంట్ పరిశీలనలో పాల్గొంటారు. దామరచెర్ల మండలంలో 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్షంగా 4,272 ఎకరాల్లో రూ.2,09,965.68 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు.

2015 జూన్ 8న సిఎం కెసిఆర్ దీనికి శంకుస్థాపన చేశారు. నిర్మాణం ప్రారంభ దశలో రూ.25,099 అంచనా వ్యయం కాగా, ప్రస్తుతం 29,965.68 కోట్లకు చేరింది. కాగా, దామరచెర్ల థర్మల్ ప్లాంటుకు ఇచ్చిన అనుమతులపై పునఃపరిశీలించాలని కేంద్ర పర్యావరణ శాఖ రాష్ట్ర అటవీ శాఖను తాజాగా ఆదేశించిన నేపథ్యంలో సిఎం రాక ప్రాధాన్యత సంతరించుకుంది. ప్లాంట్ పనుల పరిశీలనతో పాటు పురోగతిని స్వయంగా పరిశీలిస్తారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంపై సమీక్షించేందుకు కెసిఆర్ స్వయంగా ఇక్కడికి వస్తున్నారు. కాగా, సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సిఎం సూర్యాపేటలోని మంత్రి జగదీష్ రెడ్డికి ఇంటికి చేరుకుంటారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని దామరచెర్లలోని ప్లాంట్ ప్రాంతానికి మంత్రితో కలిసి వెళతారు.
పర్యటన సాగనుందిలా..
ఉదయం 11గంటలకు ప్రగతి భవన్ నుంచి సిఎం కెసిఆర్ దామరచర్ల పర్యటనకు బయలుదేరుతారు. బేగంపేట విమానాశ్రయం నుంచి వాయుమార్గం ద్వారా ప్రయాణించి మధ్యాహ్నం 12 గంటలకు దామరచెర్ల చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిని సిఎం కెసిఆర్ పరిశీలించి, అనంతరం సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం హైదరాబాద్‌కు సిఎం కెసిఆర్ తిరుగు ప్రయాణమౌతారు.

CM KCR to visit Yadadri Thermal Plant

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News