Wednesday, December 25, 2024

నేడు సిఎం కెసిఆర్ యాదాద్రి పర్యటన

- Advertisement -
- Advertisement -

CM KCR to visit Yadadri Today

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం యాదాద్రి లక్ష్మీ నరసింహ్మస్వామిని దర్శించుకోనున్నారు. ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్ నుండి రోడ్డు మార్గంలో యాదాద్రికి బయలుదేరి ఉదయం 11.30 గంటలకు చేరుకుంటారు. లక్ష్మీ నరసింహ్మాస్వామిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.00 గంటలకు యాదాద్రీ దేవాలయం నుండి ప్రగతి భవన్‌కు బయలుదేరుతారు.
కాగా అక్టోబర్ ఒకటవ తేదీన సిఎం కెసిఆర్ వరంగల్ పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సిఎం సిఆర్ శనివారం ఉదయం 9.00 గంటలకు ప్రగతి భవన్ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. ఉదయం 11.15 గంటలకు వరంగల్ ములుగు రోడ్డులోని ప్రతిమ హాస్పిటల్‌కు చేరుకుంటారు. అనంతరం ప్రతిమ రిలీఫ్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం చేస్తారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం వరంగల్ నుండి మధ్యాహ్నం 2.00 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

CM KCR to visit Yadadri Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News