శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య తండ్రి నరసింహకు శ్రద్ధాంజలి ఘటించిన కెసిఆర్
నల్గొండ: నార్కట్ పల్లిలో ఎమ్మెల్యే (నకిరేకల్) చిరుమర్తి లింగయ్య తండ్రి నరసింహ దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హాజరయ్యారు. వారికి శ్రద్ధాంజలి ఘటించారు. శోకతప్తులైన కుటుంబ సభ్యులను సిఎం కెసిఆర్ ఓదార్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన స్థానిక ప్రజలను సిఎం పలకరించారు. అనంతరం ఎమ్మెల్యే నివాసం లో ఏర్పాటు చేసిన సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్,ఎర్రబెల్లి దయకర్ రావు,మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశర్వ రెడ్డి, గోరెటి వెంకన్న, కోటిరెడ్డి, తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, సైదిరెడ్డి, భాస్కరరావు, భగత్, పైళ్ళ శేఖర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, రవీంద్ర నాయక్, ఎంపీలు రంజిత్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, టిఆర్ఎస్ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్,తదితరులు పాల్గొన్నారు.