Thursday, January 23, 2025

ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళ్లు అర్పించిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అసెంబ్లీలోని హాల్లో ఆచార్య జయశంకర్ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఉపసభాపతి పద్మారావు గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసన సభ అధికారులు జయశంకర్‌కు నివాళులు అర్పించారు. అదేవిధంగా మండలిలో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు నివాళులు అర్పించారు.
సిఎం కెసిఆర్‌ను సన్మానించిన స్పీకర్
రైతుల రుణాలు మాఫీ చేసినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శాలువాతో సన్మానించారు. లక్ష మంది రైతులకు లబ్ధి చేకూర్చినందుకు ముఖ్యమంత్రికి స్పీకర్ కృతజ్ఞతలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News