హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించింది. ఈసీ పంపిన బీఆర్ఎస్ పార్టీ అధికారిక పత్రాలపై సుముహూర్తానికి పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఈ వేడుకల్లో కర్ణాటక జేడీఎస్ నేత,మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి, ప్రముఖ సినీ నటుడు సామాజిక రాజకీయ వేత్త ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా కుమారస్వామి, పార్టీ నేతలు కెసిఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ భవన్ లో కెసిఆర్ బిఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కుమారస్వామి, ప్రకాష్ రాజ్ తో పాటు ఇతర నేతలతో కీలక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. జాతీయ స్థాయిలో పార్టీని ఎలా తీసుకెళ్లాలన్న దానిపై సిఎం కెసిఆర్ ఫోకస్ పెట్టనున్నారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ https://t.co/ougzhLu5yK
— TRS Party (@trspartyonline) December 9, 2022