Wednesday, January 22, 2025

125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రపంచప ర్యాటకులకు అమెరికా అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎలా గుర్తు కు వస్తుందో.. హైదరాబాద్ అంటే అంబేద్కర్ స్టాచ్యూ గుర్తు కు వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం భారీ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించింది. ప్రజాస్వామ్యానికి చిహ్నంగా నిర్మించబడిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సన్నగా ఉండే రాగి పొరతో కప్పబడి న ఈ విగ్రహం 879 అడుగుల ఎత్తులో 305 అడుగుల పొడ వు, 35 అడుగుల నడుము ఉంది. లేడీ లిబర్టీ ధరించిన షూ సైజు 879 కావడం గమనార్హం. ఆఫ్ లిబర్టీని అక్టో బర్ 28,1886లో ఏర్పాటు చేశారు.

Also read: జ్ఞానానికి, మేధ‌స్సుకు సింబల్ అంబేడ్కర్: జగదీష్ రెడ్డి

కాగా తెలంగాణ ప్రభుత్వం 125 అడుగుల ఎత్తు, 45.5 అడుగుల వెడల్పుతో దేశంలోనే అతి పెద్ద విగ్రహాన్ని నిర్మించింది. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2016లో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నగరం నడిబొడ్డున నిర్మించిన ఈ భారీ విగ్రహాన్ని సిఎం కెసిఆర్ శుక్రవారం ఆవిష్కరించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఇప్పటికే ఆయన హైదరాబాద్ చేరుకుని ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ ను కలిశారు. అనంతరం ప్రగతి భవన్ నుంచి ఇద్దరు కలిసి ఒకే వాహనంలో అంబేడ్కర్ స్మృతి వనానికి చేరుకున్నారు. ప్రకాశ్ అంబేడ్కర్ కు కెసిఆర్ బిఆర్ఎస్ నేతలను పరిచయం చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించి, అంబేడ్కర్ విగ్రహాన్ని మనవడు ప్రకాశ్ తో కలిసి సిఎం కెసిఆర్ విగ్రహావిష్కరణ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News