Thursday, January 23, 2025

సిఎం కెసిఆర్ చేస్తున్న కృషి, విజన్ ను వివరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

CM KCR Vision: palamuru university growth

హైదరాబాద్: రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ పట్టణంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఎక్సెల్ ఇండియా మ్యాగజైన్ ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్ విజన్-పాలమూరు యూనివర్సిటీ గ్రోత్’ పై ఏర్పాటు చేసిన సెమినార్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సిఎం చేస్తున్న కృషిని, విజన్ ను వివరించారు. రాష్ట్రంలో విశ్వ విద్యాలయాలకు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు సీఎం కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలలో పారదర్శకంగా టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులను నియమించటానికి ఆమోదం తెలిపారన్నారు. పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధికి కేసీఆర్ 60 కోట్లు నిధులను విడుదల చేశారన్నారు.

యూనివర్సిటీ లలో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశ పెట్టి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేలా కార్యాచరణ కు శ్రీకారం చుట్టాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ లక్ష్మీకాంత రాథోడ్, ఎక్సెల్ ఇండియా చీఫ్ ఎడిటర్ రామకృష్ణ సంఘం, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొపెసర్. లింబాద్రి, మాజీ ఛైర్మన్ పాపిరెడ్డికంట్రోలర్ ఆఫ్ examinations రాజ్ కుమార్, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ కెసి నర్శింహులు, డిసిసిబి వైస్ ఛైర్మన్ వెంకటయ్య, యూనివర్సిటీ రిజిస్టర్ రవికుమార్, ప్రో. మనోజా, జిల్లా షీప్ ఫెడరేషన్ చైర్మన్ శాంతన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News