Thursday, January 23, 2025

కొల్హాపూర్‌ మహాలక్ష్మీ అమ్మవారి సన్నిధిలో సిఎం కెసిఆర్ దంపతులు..

- Advertisement -
- Advertisement -

CM KCR Visit Kolhapur Mahalakshmi Temple

హైదరాబాద్: అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవ శక్తిపీఠమైన కొల్హాపూర్‌ శ్రీ మహాలక్ష్మీ అంబాబాయి అమ్మవారి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దర్శించుకున్నారు. గురువారం ఉదయం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులతో కలిసి సిఎం కొల్హాపూర్ కు బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నం కొల్హాపూర్ లోని శ్రీ మహాలక్ష్మీ అంబాబాయి ఆలయానికి చేరుకున్న సిఎం కెసిఆర్ కు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో కార్వీర్ నివాసిని శ్రీ మహాలక్ష్మి అంబాబాయి అలంకార పూజలో కుటుంబ సభ్యులతో కలిసి సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం సిఎం కెసిఆర్ హైదరాబాద్ కు తిరుగుపయనం కానున్నారు.

CM KCR Visit Kolhapur Mahalakshmi Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News