Sunday, December 22, 2024

మళ్ళీ వస్తా… ఆలయ అభివృద్ధి, విస్తరణపై సమీక్ష నిర్వహిస్తా

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: కొండగట్టులోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులతో రెండు గంటలకు పైగా సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు అనే పేరు రావాలని ఆకాంక్షించారు. ప్రపంచాన్నే ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని సూచించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి బృహత్తర ప్రాజెక్ట్ అన్న సిఎం భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలిని, ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్డులను వేయాలని అధికారులను ఆదేశించారు.

CM KCR visit kondagattu anjaneya swamy templeదేశంలోనే గొప్పగా హనుమాన్ జయంతి కొండగట్టులో జరగాలన్నారు. వేల మంది ఒకేసారి హనుమాన్ దీక్ష ధారణ, విరమణ చేసే సమయంలో ఏలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. హనుమాన్ దీక్ష దివ్యంగా, గొప్పగా జరిగేలా చూడాలన్నారు. సుమారు 850 ఎకరాలలో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేయాలని తెలిపారు. పెద్ద వాల్, పార్కింగ్, పుష్కరిణీ, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, కోనేరు, పుష్కరిణీని అభివృద్ధి చేయాలన్నారు. 86 ఎకరాలలో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని వెల్లడించారు. వసతులు గొప్పగా ఉంటే దర్శనానికి వచ్చే భక్తులు పెరుగుతారని తెలిపారు. మళ్ళీ వస్తా…. ఆలయ అభివృద్ధి, విస్తరణపై సమీక్ష నిర్వహిస్తాని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News