Tuesday, November 5, 2024

సగం భారతదేశం అంజన్న వైపు మరలేలా నిర్మాణం ఉండాలి..

- Advertisement -
- Advertisement -

కొండగట్టు: భారతదేశంలోనే గొప్పదైన ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడున్నదంటే కొండగట్టు అంజన్న ఆలయం పేరు వినపడేలా అత్యంత గొప్పగా, అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కె. ఆదేశించారు. బుధవారం కొండగట్టు ఆలయాన్ని సిఎం కెసిఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ సన్నిధిలో కొండగట్టు అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని ఆయన నిర్వహించారు.

వచ్చే హనుమాన్ జయంతి నాటికల్లా సగం భారతదేశం కొండగట్టు అంజన్న వైపు మరలేలా నిర్మాణం ఉండాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ప్రస్తుతం వస్తున్న భక్తులతో పాటు, ఆలయ అభివృద్ధి తర్వాత పెరగనున్న రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు అందించేలా నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. క్యూలైన్ల నిర్మాణం, ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బందులు కలగకుండా, రవాణా సౌకర్యాలు, విశాలమైన ప్రధాన ద్వారం ఏర్పాటు చేయాలని కెసిఆర్ సూచించారు.

కాళేశ్వరం నీటిని పైపుల ద్వారా కొండడట్టుకు తరలించి భక్తుల సౌకర్యాలకు సరిపోయేలా నీటి వసతిని కల్పించాలన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్, దవాఖాన, బస్టాండు, పార్కింగ్ స్థలం, రోడ్ల నిర్మాణం, పుష్కరిణి, వాటర్ ట్యంకులు, నీటి వసతి, కాటేజీల నిర్మాణం, దీక్షాపరుల మంటపం, పోలీస్ స్టేషన్, కళ్యాణ కట్ట తదితర మౌలిక వసతులను భవిష్యత్ కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మించాలన్నారు. ఈ నిర్మాణానికి సంబంధించి శిల్పులను సమకూర్చాలని ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయికి సిఎం సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News