Sunday, December 22, 2024

నల్గొండపై ముఖ్యమంత్రి కెసిఆర్ వరాల జల్లు

- Advertisement -
- Advertisement -

cm kcr visit to nalgonda district

నుడా(నల్లగొండ)పై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు

మర్రిగూడెం బైపాస్ రోడ్ పై ఫ్లైఓవర్ బ్రిడ్జి

యస్ యల్ బి సి కార్యలయ ప్రాంగణంలో చీఫ్ ఇంజినీర్ కార్యాలయం

పెద్ద గడియారం వద్ద నాలుగు అంతస్థులలో అధునాతన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్

నుడా: నల్లగొండ మున్సిపాలిటీని ఆధునికరించేందుకు గాను నుడా(నల్లగొండ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)గా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మరిన్ని వరాలు ప్రకటించారు. నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తండ్రి దివంగత నర్సింహ దశదిన కర్మలలో పాల్గొనేందుకు గాను గురువారం నార్కెట్పల్లి కి చేరుకున్నారు. అనంతరం జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి శాసనసబ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,మున్సిపల్ కమిషనర్ రమణాచారి తదితరులతో కలసి నుడా పై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నల్లగొండ జిల్లా కేంద్రం ప్రవేశంలో ఉన్న మర్రిగూడ బైపాస్ రోడ్ పై బై-పాస్ రోడ్ ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అంతే గాకుండా నల్లగొండ నడిబొడ్డున ఉన్న పెద్ద గడియారం సెంటర్ లో ప్రస్తుతం ఉన్న ఆర్&బి అతిథి గృహం స్థానంలోనే అధునాతన సౌకర్యాలతో నాలుగు అంతస్థుల ఆర్అండ్ బి వసతి గృహం నిర్మించ తల పెట్టినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దానికి తోడు నల్లగొండ-నాగార్జున సాగర్ రహదారిపై ఉన్న యస్ ఎల్ బి సి కార్యాలయ ప్రాంగణంలో చీఫ్ ఇంజినీర్ కార్యాలయం నిర్మిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News