- Advertisement -
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవన్ నుంచి ఆదివారం నిర్మిల్ కు బయలుదేరారు. రోడ్డు మార్గాన ఆయన నిర్మల్ చేరుకుంటారు. కెసిఆర్ తో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపి సంతోష్ కుమార్ ఉన్నారు. నిర్మల్ లో సిఎం కెసిఆర్ సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం రూ.56 కోట్లతో నిర్మల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులో నూతనంగా కలెక్టరేట్ భవనాన్ని నిర్మించింది. కెసిఆర్ నిర్మల్ పర్యటన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
- Advertisement -