Sunday, December 22, 2024

ఆలయాలను సందర్శించిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మహారాష్ట్ర పర్యటనలో రెండో రోజైన మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తుల్జాపూర్లో కొలువైన తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయం వద్ద అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో భవానీ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌కు అర్చకులు ఆశ్వీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు సిఎం కెసిఆర్ సర్కోలిలో జరిగిన బిఆర్‌ఎస్ సభలో పాల్గొన్నారు. అక్కడి నుంచి తుల్జాపూర్ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం తన రెండు రోజుల పర్యటన ముగించుకుని మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఉన్నారు.
శ్రీవిఠలేశ్వర స్వామికి, రుక్మిణీ అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ
పండరిపూర్‌లోని విఠలేశ్వర స్వామి, రుక్మిణీదేవీని సిఎం కెసిఆర్ మంగళవారం ఉదయం దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవిఠల్ రుక్మిణీ ఆలయ సందర్శన సందర్భంగా సిఎం కెసిఆర్ శ్రీవిఠలేశ్వర స్వామికి, రుక్మిణీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత అమ్మవారి పాదాలను పసుపు కుంకుమలతో అలంకరించి మొక్కుకున్నారు. ఆలయ అర్చకులు సిఎం కెసిఆర్‌కు మెడలో తులసి మాల వేసి వేదమంత్రాలతో ఆశీర్వాదించారు. అంతకుముందు కెసిఆర్ ఆలయానికి చేరుకోగానే ప్రధాన ద్వారం దగ్గర ఆయనకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత కాషాయ వస్త్రం కప్పి సత్కరించారు. అనంతరం శ్రీవిఠలేశ్వర స్వామి, రుక్మిణీ అమ్మవార్లతో కూడిన ప్రతిమను, అదేవిధంగా రుక్మిణీ అమ్మవారి చిత్రపటాన్ని సిఎం కెసిఆర్‌కు బహూకరించారు.

KCR Mokku 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News