Monday, December 23, 2024

ఢిల్లీ పర్యటనలో కెసిఆర్ బిజీబిజీ

- Advertisement -
- Advertisement -

CM KCR visited the BRS party office

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు బిజి బిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండవ రోజైన బుధవారం వసంత్ విహార్‌లో నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ నిర్మాణలను నిషితంగా గమనించారు. నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంగణమంతా కలియతిరిగారు. ఈ సందర్భంగా పనులకు సంబంధించి ఇంజనీర్లకు ఆయన పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా పార్టీ ఆఫీసు నిర్మాణాన్ని పూర్తి చేయాలని కెసిఆర్ ఆదేశించారు. సిఎం కెసిఆర్ వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్రలతో పాటు పలువురు ఉన్నారు.

సమాజ్‌వాది పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ములా యం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మంగళవారం కెసిఆర్ ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్లారు. అంత్యక్రియల అనంతరం తిరిగి ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న వెంటనే ఆయన బిఆర్‌ఎస్ కోసం సిద్ధమవుతోన్న కార్యాలయాన్ని సందర్శించారు. ఆ కార్యాలయంలో మార్పులపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాగా ఈ వారంతం వరకు కెసిఆర్ ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. ఈ సందర్భంగా పలు పార్టీలతో జాతీయ రాజకీయాలపై చర్చిస్తారని సమాచారం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News