Monday, December 23, 2024

ఎంఎల్‌ఎ మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని పరామర్శించిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎంఎల్‌ఎ మంచిరెడ్డి కిషన్, ఆయన కుటుంబ సభ్యులను రెడ్డిని ముఖ్యమంత్రి కెసిఆర్ పరామర్శించారు. ఆదివారం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అమ్మ పద్మమ్మ (92) దశ దినకర్మ కార్యక్రమానికి సిఎం కెసిఆర్ హాజరై పద్మమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ వెంట మంత్రులు సబితా ఇంద్రారెడ్డి,చామకూర మల్లారెడ్డి, ఎంపిలు నామా నాగేశ్వర్ రావు, గడ్డం రంజిత్ రెడ్డి, ఎంఎల్‌సిలు శంభీపూర్ రాజు , నవీన్ రావు, కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎంఎల్‌ఎలు బాల్క సుమన్, జి.జైపాల్ యాదవ్, కెపి వివేకానంద, జెడ్‌పి చైర్మన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ తీగల కృష్ణారెడ్డి, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News