Sunday, December 22, 2024

రేపు నాగ్‌పూర్‌కు సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం(జూన్ 15) మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వెళ్లనున్నారు. అక్కడ నిర్మించిన బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. నాగ్‌పూర్ సువిశాలమైన కొత్త భవనాన్ని పార్టీ నిర్మించింది. ఈ నెల 15న ఉదయం నాగపూర్ వెళ్లనున్న బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్, అక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు స్థానికంగా ఏర్పాటు చేసిన చేరికల సమావేశంలో పాల్గొంటారు.

ముంబై, పుణె, ఔరంగాబాద్‌లోనూ పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు పార్టీ భవనాల కోసం అన్వేషణ జరుగుతున్నది. బిఆర్‌ఎస్‌కు మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతుండగా, పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల నియామక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 19న నాందేడ్‌లో పార్టీ అధినేత కెసిఆర్ రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News